Paramjeet Singh: నాకే ఎందుకీ కష్టాలని బాధపడేవాళ్లు తప్పక చదవండి.. సరిగ్గా 38 ఏళ్ల క్రితం ఈయన లైఫ్ ఎలా ఉండేదంటే..

ABN , First Publish Date - 2022-07-26T02:25:52+05:30 IST

ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర (Anand Mahindra) సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు.

Paramjeet Singh: నాకే ఎందుకీ కష్టాలని బాధపడేవాళ్లు తప్పక చదవండి.. సరిగ్గా 38 ఏళ్ల క్రితం ఈయన లైఫ్ ఎలా ఉండేదంటే..

ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర (Anand Mahindra) సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. తనకు నచ్చిన వీడియోలను, పోస్ట్‌లను ట్విటర్ ద్వారా ఇతరులతో పంచుకుంటుంటారు. తాజాగా ఆయన పరమ్‌జీత్ సింగ్ (Paramjeet Singh) అనే వ్యక్తి గురించి ట్వీట్ చేశారు. పరమ్‌జీత్ తన స్టార్టప్ హీరో (Start-up Hero) అని పేర్కొన్నారు. పరమ్‌జీత్‌లా బతకాలంటే చాలా ధైర్యం, ఆత్మవిశ్వాసం కావాలని, ఆయన ఎన్నోసార్లు జీవితాన్ని పున:ప్రారంభించారని తెలిపారు. పరమ్‌జీత్ గురించి `బెటర్ ఇండియా` ఓ కథనం ప్రచురించింది. అది చదివిన ఆనంద్ మహీంద్రా ట్విటర్‌ ద్వారా ప్రశంసించారు. 


ఎంతో మందిని ఆకట్టుకున్న `రస్నా`కు ఏకైక పంపిణీదారు పరమ్‌జీత్ సింగ్. అయితే 1984 అల్లర్లు పరమ్‌జీత్‌ను దారుణంగా దెబ్బతీశాయి. మొత్తం ఆస్తి అంతా కోల్పోయారు. అయినా నిరాశపడకుండా ట్యాక్సీ డ్రైవర్‌గా మారి కొత్త జీవితాన్ని ప్రారంభించారు. కొద్ది రోజుల్లోనే రోడ్డు ప్రమాదానికి గురై 13 రోజుల పాటు కోమాలోకి వెళ్లిపోయారు. ఆ సమయంలోనే గుండెపోటు కూడా వచ్చింది. అన్ని ఎదురు దెబ్బలు తగిలినా పరమ్‌జీత్‌ తన ప్రయాణాన్ని మాత్రం ఆపలేదు. ప్రస్తుతం పరమ్‌జీత్‌ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ కథనం చదివిన ఎంతో మంది నెటిజన్లు పరమ్‌జీత్‌ స్ఫూర్తిని కొనియాడుతున్నారు. ఆయన ఆత్మవిశ్వాసం ఎంతో మందికి ఆదర్శం అంటూ కామెంట్లు చేస్తున్నారు. 

Updated Date - 2022-07-26T02:25:52+05:30 IST