వాడీవేడిగా సర్వసభ్య సమావేశం

ABN , First Publish Date - 2022-06-25T04:42:25+05:30 IST

ప్రజాప్రతినిధుల వరుస ప్రశ్నలతో మండల ప్రజాపరిషత్‌ సర్వసభ్య సమావేశం శుక్రవారం వాడీగా వేడిగా జరిగింది.

వాడీవేడిగా సర్వసభ్య సమావేశం
నిరసనగా బైఠాయించిన ఎంపీటీసీలు

నిధులు కేటాయించాలని ప్రజాప్రతినిధుల నిరసన 

సర్వసభ్య వేదిక ముందు బైఠాయింపు

కోరం లేకుండా సమావేశం ఎలా నిర్వహిస్తారని ఎంపీడీవో నిలదీత

దుమ్ముగూడెం జూన్‌ 24: ప్రజాప్రతినిధుల వరుస ప్రశ్నలతో మండల ప్రజాపరిషత్‌ సర్వసభ్య సమావేశం శుక్రవారం వాడీగా వేడిగా జరిగింది. రూ.36లక్షల అభి వృద్ధి నిధులను ఎక్కడ, ఎవరి కోటాలో ఎంత కేటా యించారో తెలపాలంటూ ఎంపీటీసీలు యలమంచి వంశీ కృష్ణ, కొర్సా చిలకమ్మ నిరసనగా వేదిక ముందు నేలపై బైఠాయించారు. నిధులను ఏకపక్షంగా, ఇష్టాను సారంగా కేటాయించారని ఆరోపించారు. కోరం లేకుండా సమా వేశాన్ని ఎలా మొదలు పెట్టారని ఎంపీడీవోను నిలదీశా రు. అంతా నిబంధనల ప్రకారమే జరిగిందంటూ ఎంపీ డీవో సమాధానమిచ్చారు. సమావేశం చివర్లో నిధుల కేటా యింపు వివరాలు చెబుతామనడంతో నిరసన విర మించారు. అనంతరం లక్ష్మీనగరం హెడ్‌క్వార్టరులో వి ద్యుత్‌ లోఓల్టేజీ సమస్య, ములకపాడు వద్ద తాలిపేరు పిల్ల కాల్వ మరమ్మతులు, మధ్యాహ్నభోజనం బిల్లులు, రా మారావుపేట వద్ద తాలిపేరు కాల్వపై వంతెన మర మ్మతులపై ప్రశ్నించారు. గతేడాదిలా నకిలీ పత్తి గింజలు మార్కెటులోకి రాకుండా నిఘా పెట్టాలని నడికుడి ఎంపీటీసీ తిరుపతిరావు కోరారు. ఐదు రోజులుగా డబ్ల్యూ ఎల్‌ రేగుబల్లి పంచాయతీకి మిషన్‌ భగీరథ నీరు సక్రమం గా రావడం లేదని, సరఫరా విషయంలో అధికా రులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సర్పంచి మోహ న్‌రావు నిలదీశారు. మండల వ్యాప్తంగా ఎక్కడా భగీరఽథ పధకం నిర్వహణ బాగాలేదని పలువురు ఎంపీటీసీలు అ సహనం వ్యక్తం చేశారు. గౌరారం, చిననల్లబల్లిలో మూడేళ్లుగా విద్యుత్‌ సమస్యలు పరిష్కరించడం లేదని, విద్యుత్‌శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ సర్పంచ్‌ లు జ్యోతి, జయమ్మలు సబ్‌-ఇంజనీరుపై ధ్వజమెత్తారు. రేషనుకార్డుల్లో పేర్ల న మోదు విషయంపై రెవెన్యూశాఖ అసలు ప్రచారమే చేయ డం లేదని, దీంతో ఆదివాసీలు తీవ్రంగా నష్టపోతున్నారని సర్పంచి జ్యోతి ప్రశ్నించారు. వరి తగ్గించి పత్తి పంట వేయాలని ఏవో నవీన్‌కుమార్‌ తెలిపారు. ఐసీడీఎస్‌ శాఖ సమాచారం సమగ్రంగా లేదని ఎంపీడీవో చంద్రమౌళి సూపర్‌వైజర్‌పై అసహనం వ్యక్తం చేశారు. ఐసీడీఎస్‌ సీడీపీవో, అటవీశాఖ, ఎక్సైజుశాఖ అధికారులు గైర్హాజరయ్యారు. కార్యక్రమంలో ఎంపీపీ లక్ష్మి, ఎంపీడీవో చంద్ర మౌళి అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-25T04:42:25+05:30 IST