Munugode bypollపై ప్రగతి భవన్‌లో కీలక సమావేశం

ABN , First Publish Date - 2022-09-20T18:18:58+05:30 IST

సీఎం కేసీఆర్ (CM KCR) పిలుపుతో హుటాహుటిన ప్రగతిభవన్‌ (Pragathi Bhavan)కు మంత్రి జగదీష్ రెడ్డి (Minister Jagadish Reddy),

Munugode bypollపై ప్రగతి భవన్‌లో కీలక సమావేశం

Nalgonda : సీఎం కేసీఆర్ (CM KCR) పిలుపుతో హుటాహుటిన ప్రగతిభవన్‌ (Pragathi Bhavan)కు మంత్రి జగదీష్ రెడ్డి (Minister Jagadish Reddy), మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి (Kusukuntla Prabhakar Reddy) వెళ్లారు. మునుగోడు ఉప ఎన్నిక (Munugode by Poll)పై ప్రగతి భవన్‌లో కీలక సమావేశం నిర్వహించారు. త్వరలో అభ్యర్ధి పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. నేటి నుంచి మునుగోడు నియోజకవర్గం (Munugodu Constuency)లో మండలాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలు, వనభోజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పార్టీ కేడర్‌కు కూసుకుంట్ల అభ్యర్థిగా కేసీఆర్ సంకేతాలు పంపించారు. ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం వేదికగా కూసుకుంట్ల పేరును ప్రతిపాదించేలా సూచనలు చేయనున్నారు.


మునుగోడు అభ్యర్థి(Munugode Contestant) ఎవరన్నదానిపై గులాబీ నేతల్లో(TRS Leaders) నిన్న మొన్నటి వరకూ ఉత్కంఠ చోటు చేసుకుంది. టికెట్‌ కోసం ఆశావహులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూశరాు. మునుగోడు టీఆర్‌ఎస్ టికెట్‌(TRS Ticket)ను బీసీ నేతలు(BC Leaders) ఆశించారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ(Congress Party) తమ అభ్యర్థిని ప్రకటించింది.బీజేపీ, కాంగ్రెస్ నుంచి బరిలో రెడ్డి సామాజికవర్గ నేతలు ఉన్నారు.


అయితే టీఆర్ఎస్ టికెట్‌ (TRS Ticket)ను సైతం రెడ్డి సామాజిక వర్గానికే ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) నిర్ణయం తీసేసుకున్నారు. కానీ ఇంత వరకూ ప్రకటించలేదు. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌ (Farmer MLA Kusukuntla Prabhakar) లేదా మండలి చైర్మన్ గుత్తా(Gutha) మధ్య పోటీ నెలకొంది. అయితే కేసీఆర్ మాత్రం కూసుకుంట్ల వైపే మొగ్గు చూపారు. సర్వే(Survey)ల ఆధారంగా అభ్యర్థిని కేసీఆర్‌ ప్రకటించనున్నారు. అయితే వీలైనంత త్వరగా అభ్యర్థిని ప్రకటించాలని స్థానిక నేతలు కోరుతున్నారు.

Updated Date - 2022-09-20T18:18:58+05:30 IST