సమావేశానికి ప్రాధాన్యం ఇవ్వాలి

ABN , First Publish Date - 2021-07-24T05:01:12+05:30 IST

మూడు నెలలకు ఒకసారి నిర్వహించే మండల సర్వసభ్య సమావేశానికి అధికారులు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వ విప్‌ గు వ్వల బాలరాజు అన్నారు.

సమావేశానికి ప్రాధాన్యం ఇవ్వాలి
కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేస్తున్న ప్రభుత్వం విప్‌ గువ్వల

- అధికారులకు ప్రభుత్వం విప్‌ గువ్వల బాలరాజు సూచన


 ఉప్పునుంతల, జూలై 23: మూడు నెలలకు ఒకసారి నిర్వహించే మండల సర్వసభ్య సమావేశానికి అధికారులు ప్రాధాన్యం ఇవ్వాలని  ప్రభుత్వ విప్‌ గు వ్వల బాలరాజు అన్నారు.  నివేదిక ఇవ్వకుండా సమావేశానికి ప్రాధాన్యత త గ్గించడం మంచి పద్ధతి కాదని, మార్చుకోవాలని సూచించారు. శుక్రవారం ఉ ప్పునుంతలలోని మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ అరుణ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సమావేశానికి రాని అధికారులకు మెమోలు  జారీ చేయాలని ఎంపీడీవోకు ఆయన సూచించారు. ప్రభుత్వం చేపడుతున్న హరితహారం పథకంలో ప్రతీ ఒక్కరు భాగస్వాములు కావాలన్నారు. మంత్రి కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా నిమోజకవర్గంలో పార్టీ లకతీతంగా  మొక్కలు నాటే కార్యక్రమంలో  పాలుపంచుకోవాలన్నారు. వర్షం తో ముంపు ప్రాంతంలో పాలకులు ఎప్పటికప్పుడు పరిష్కరించేలా చూడాల న్నారు. అంతకుముందు అధికారులు శాఖల వారిగా ఎజెండా చదివి వినిపిం చారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు ప్రజాప్రతినిధులతో కలిసి మొక్కలు నాటారు. మండలంలోని వి విధ గ్రామాలకు చెందిన కల్యాణలక్ష్మి పథకంలో  27 మందికి ఆయన చేతుల మీదుగా చెక్కులు పంపిణీ చేశారు. ఎంపీడీవో లక్ష్మణ్‌రావు, తహసీల్దార్‌ కృష్ణ య్య. జడ్పీటీసీ అనంతాప్రతాప్‌రెడ్డి, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు ఉన్నారు.  

Updated Date - 2021-07-24T05:01:12+05:30 IST