Mega 154: కలుద్దాం సంక్రాంతికి..

Published: Fri, 24 Jun 2022 13:05:20 ISTfb-iconwhatsapp-icontwitter-icon
Mega 154: కలుద్దాం సంక్రాంతికి..

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా నటిస్తున్న చిత్రాలలో పక్కా మాస్ ఎంటర్‌టైనర్ మెగా 154 (Mega 154) కూడా ఒకటి. ఈ చిత్రాన్ని బాబీ తెరక్కిస్తున్నారు. తాజాగా సాలీడ్ అప్‌డేట్ వచ్చి మెగా అభిమానులను ఆనందంలో ముంచేస్తుంది. మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) కూడా మరో హీరోగా నటిస్తున్న ఈ సినిమా టైటిల్‌ను అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు కానీ.. ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) అనే టైటిల్ మాత్రం సోషల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. మెగాస్టార్ ఈ సినిమా షూటింగ్‌ను శ‌ర‌వేగంగా పూర్తి చేస్తున్నారు. పాతికేళ్ల క్రితం ముఠా మేస్త్రి, గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు చిత్రాలలో ఎలా కనిపించారో మళ్ళీ ఇప్పుడు అదే లుక్‌లో కనిపించబోతున్నారు. ఇప్పటికే, చిరు లుక్‌ను కూడా చిత్ర యూనిట్ రివీల్ చేసిన సంగతి తెలిసిందే. 

ఈ సినిమా కోసం చెన్నైలో భారీ సెట్ వేసి అక్క‌డ చిత్రీక‌రించారు. అలాగే, మ‌లేషియాలోనూ చిన్నపాటి షెడ్యూల్‌ను కంప్లీట్ చేశారు. అయితే, తాజాగా చిత్ర బృందం మెగా 154 సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్‌పై సాలీడ్ అప్‌డేట్‌ను అనౌన్స్ చేసింది. ఈ చిత్రాన్ని 2023, సంక్రాంతికి విడుద‌ల చేయ‌డానికి రెడీ అయినట్టు మైత్రీ మూవీ మేక‌ర్స్‌ అధికారికంగా వెల్లడించారు. ఈ సందర్భంగా '2023 సంక్రాంతికి జ‌న‌వ‌రిలో క‌లుద్దాం' అంటూ పోస్టర్‌ను వదిలారు. ఈ పోస్టర్‌లో కొక్కెం ప‌ట్టుకున్న మెగాస్టార్ చిరంజీవి చేయి ఉన్న పోస్ట‌ర్‌ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక ఈ తాజా పోస్ట‌ర్ చూస్తుంటే చిత్రంలో పక్కా మాస్ ఎలిమెంట్స్‌కు ఢోకా లేదనిస్తుంది.

ఆచార్య సినిమా నిరాశపరచడంతో మళ్ళీ మెగాస్టార్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు ఎప్పుడు బద్దలు కొడతారో అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అంతేకాదు, ఇప్పుడు అందరూ గాడ్ ఫాదర్ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో మెగా 154 రిలీజ్ డేట్ ప్రకటించి సర్‌ప్రైజ్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. మొత్తానికి 2023 సంక్రాంతికి మెగా ఫ్యాన్స్ రచ్చ చేయడం గ్యారెంటీ. ఇందులో చిరు సరసన హీరోయిన్‌గా శృతి హాసన్ నటిస్తోంది. 


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International