నేడు మెగా వ్యాక్సినేషన్... ఒక్కరోజులో 20 లక్షల జనాభాకు టీకా!

ABN , First Publish Date - 2021-08-03T11:51:24+05:30 IST

ఉత్తరప్రదేశ్‌ యోగి సర్కార్ ఈరోజు...

నేడు మెగా వ్యాక్సినేషన్... ఒక్కరోజులో 20 లక్షల జనాభాకు టీకా!

లక్నో: ఉత్తరప్రదేశ్‌ యోగి సర్కార్ ఈరోజు (ఆగస్టు 3) వ్యాక్సినేషన్‌లో కొత్త రికార్డు నెలకొల్పాలని సంకల్పించింది. ఇప్పటివరకూ దేశంలో ఎక్కడా జరగని రీతిలో ఒక్కరోజులో అత్యధిక జనాభాకు టీకా వేసేందుకు సన్నాహాలు చేసింది. ఉత్తరప్రదేశ్‌లో ఇప్పటివరకూ 4 కోట్ల 87 లక్షల మందికి టీకాలు వేశారు. అయితే ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా మెగా డ్రైవ్ వ్యాక్సినేషన్ నిర్వహించనున్నారు. ఈరోజు యూపీలోని 20 లక్షల జనాభాకు వ్యాక్సిన్ వేసేందుకు యోగి సర్కారు ప్రణాళిక సిద్ధం చేసింది. 


కరోనా థర్డ్ వేవ్ రాకముందే వీలైనంత ఎక్కువమందికి వ్యాక్సిన్ వేయాలని రాష్ట్రప్రభుత్వం భావించింది. వ్యాక్సినేషన్ విషయంలో దేశంలోనే యూపీ నంబర్ వన్‌గా నిలిచింది. యూపీ ఆరోగ్యశాఖ మంత్రి జయ ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ ఒక్క రోజులో 12 లక్షల మందికి వ్యాక్సిన్ సులభంగా వేయగలమని, అయితే ఒక్క రోజులో 20 లక్షల మందికి వ్యాక్సిన్ వేయడం కొంచెం కష్టమైన పని అయినప్పటికీ, ఈ లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.

Updated Date - 2021-08-03T11:51:24+05:30 IST