మెగా డాటర్ నిహారిక పెళ్ళికూతురు కాబోతోంది. ఆమె వివాహానికి సంబంధించిన వివరాలు వచ్చేశాయి. డిసెంబర్ 9న నిహారిక వివాహం జొన్నలగడ్డ వెంకట చైతన్యతో అంగరంగ వైభవంగా జరగబోతోంది. ఈ పెళ్లికి సంబంధించిన వార్తలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పటికీ.. సరైన క్లారిటీ మాత్రం ఇప్పటి వరకు రాలేదు. తాజాగా నిహారిక పెళ్ళికి సంబంధించిన శుభలేఖను మెగా ఫ్యామిలీ విడుదల చేసింది. రాజస్థాన్లో నిహారిక వివాహం బుధవారం, డిసెంబర్ 9న జరగబోతోంది. ఆ తర్వాత రిసప్షన్ శుక్రవారం, డిసెంబర్ 11న.. హైదరాబాద్లోని జెఆర్సీ కన్వెన్షన్లో జరగనుంది. నిహారిక పెళ్లి వివరాలకు సంబంధించిన వెడ్డింగ్ కార్డ్ ఇదే.