మాస్‌రాజా స్థానంలో మెగా హీరో..?

Jun 7 2021 @ 08:44AM

మాస్ మ‌హరాజా ర‌వితేజ వ‌రుస సినిమాల‌కు ఓకే చెబుతూ బిజీగా ఉంటున్నాడు. ప్ర‌స్తుతం ఖిలాడి సినిమాను పూర్తి చేసే ప‌నిలో ఉన్న ర‌వితేజ త‌దుప‌రి సినిమాలపై ప‌లు వార్త‌లు వినిపిస్తూ వ‌స్తున్నాయి. చాలా మంది డైరెక్ట‌ర్స్ పేర్లు వినిపించాయి. ఈ లిస్టులో త్రినాథ‌రావు న‌క్కిన పేరు కూడా ప్ర‌ముఖంగా వినిపించింది. ఈ ద‌ర్శ‌కుడు ర‌వితేజ కోసం చాలా రోజులుగా వెయిటింగ్‌లో ఉన్న‌ప్ప‌టికీ, ప్రాజెక్ట్ సెట్ కాలేదు. ఈ ప్రాజెక్ట్ నుంచి ర‌వితేజ త‌ప్పుకున్నాడ‌ని టాక్ వినిపిస్తోంది. దీంతో మేక‌ర్స్ మెగా క్యాంప్ హీరో వ‌రుణ్ తేజ్‌తో ఈ సినిమా చేయాల‌నుకుంటున్నార‌నే న్యూస్ నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. కొన్నిరోజులాగితే మ‌రింత క్లారిటీ వ‌స్తుంద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల టాక్‌. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.