మెగా వ్యాక్సిన్‌ శిబిరానికి విశేష స్పందన

ABN , First Publish Date - 2021-12-27T15:48:47+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన 16వ మెగా వ్యాక్సిన్‌ శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ముఖ్యమంత్రి స్టాలిన్‌ జారీచేసిన ఉత్తర్వుల మేరకు ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు,

మెగా వ్యాక్సిన్‌ శిబిరానికి విశేష స్పందన

ప్యారీస్‌(చెన్నై): రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన 16వ మెగా వ్యాక్సిన్‌ శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ముఖ్యమంత్రి స్టాలిన్‌ జారీచేసిన ఉత్తర్వుల మేరకు ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రులు, అంగన్‌వాడీ కేంద్రాలు, పౌష్టికాహార కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, విమానాశ్రయాలు, హార్బర్లు, ఊటీ, కొడైకెనాల్‌, ఏర్కాడు తదితర వేసవి విడిది ప్రాంతాలు, ప్రముఖ పర్యాటక కేంద్రాలు, షాపింగ్‌ మాల్స్‌, హిందూ దేవాలయాలు, చర్చిలు, మసీదులు, ప్రధాన మార్కెట్లు, ప్రధాన రహదారుల్లో ఉన్న కూడళ్లు అంటూ సుమారు 50 వేల ప్రాంతాల్లో ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు ఆరోగ్యశాఖ సిబ్బంది ప్రజలకు టీకాలు వేశారు. నగరంలో ఏర్పాటైన వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ కేంద్రాలను ఆరోగ్యశాఖ మంత్రి ఎం సుబ్రమణ్యం, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి జే రాధాకృష్ణన్‌, గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ కమిషనర్‌ గగన్‌దీప్‌ సింగ్‌ బేదీ పరిశీలించారు. కాగా, కరోనా టీకాలు వేయించుకున్న ప్రజలకు సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఏర్పడితే నివారించేందుకు ఆయా టీకా శిబిరాల్లోనే సదుపాయాలు కూడా కల్పించడం గమనార్హం.

Updated Date - 2021-12-27T15:48:47+05:30 IST