మెగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌కు పోటెత్తిన జనం

ABN , First Publish Date - 2021-12-19T16:42:51+05:30 IST

రాష్ట్రంలో కొత్తరూపు సంతరించుకున్న కరోనా వైరస్‌ ‘ఒమైక్రాన్‌’ వ్యాపిస్తోందన్న భయంతో శనివారం నిర్వహించిన 15వ విడత మెగా వ్యాక్సినేషన్‌ శిబిరాల వద్ద టీకాలు వేసుకునేందుకు ప్రజలు బారులు తీరారు. మొదటి

మెగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌కు పోటెత్తిన జనం

                          - సీఎం స్టాలిన్‌ పరిశీలన


చెన్నై: రాష్ట్రంలో కొత్తరూపు సంతరించుకున్న కరోనా వైరస్‌ ‘ఒమైక్రాన్‌’ వ్యాపిస్తోందన్న భయంతో శనివారం నిర్వహించిన 15వ విడత మెగా వ్యాక్సినేషన్‌ శిబిరాల వద్ద టీకాలు వేసుకునేందుకు ప్రజలు బారులు తీరారు. మొదటి డోసు  టీకాలు వేసుకు ని గడువు దాటినా పట్టించుకొని వారంతా రెండో డోసు టీకాలు వేసుకునేందుకు ఆసక్తిగా తరలివ చ్చారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 50 వేల కేంద్రాల్లో ఈ టీకా శిబిరాలను నిర్వహించారు. గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో రెండు వేల కు పైగా టీకా శిబిరాలు నిర్వహించారు. స్థానిక గూడువాంజేరిలో ఏర్పాటైన టీకా శిబిరాన్ని ముఖ్యమంత్రి స్టాలిన్‌ పరిశీలించారు. నగరంలో ప్రభుత్వ ఆస్పత్రులు, సబర్బన్‌ హెల్త్‌ సెంటర్లు, ప్రైవేటు ఆస్పత్రులు, సినిమా థియేటర్లు, బస్టాం డ్లు, బస్టాపులు, రైల్వేస్టేషన్లు వాణిజ్య సముదా యాలున్న కూడళ్లలో టీకాలు శిబిరాలు ఏర్పాటు చేశారు. టి.నగర్‌, కోయంబేడు, రాయపేట, రాయపురం, వ్యాసార్పాడి, పెరంబూరు, మధురవాయల్‌, మైలాపూరు, అడయార్‌, వేళచ్చేరి తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన టీకాల శిబిరాల వద్ద మునుపెన్నడూ లేని విధంగా శనివారం ఉదయమే చేత ఆధార్‌కార్డులు పట్టుకుని నగరవాసులు టీకాలు వేసుకునేందుకు క్యూలైన్లలో నిలిచారు. టి.నగర్‌ ప్రధాన బస్టాండు వద్ద నిర్వహించిన శిబిరంలో వివిధ ప్రాంతాల నుంచి బస్సులలో వచ్చిన ప్రయాణికులు కూడా టీకాలు వేసుకునేందుకు బారులు తీరారు. ఇదే విధంగా కోయం బత్తూరు, తిరుచ్చి, మదురై, తిరునల్వేలి, కడలూరు, తంజావూరు తదితర నగరాలలోనూ నిర్వహించిన టీకాల శిబిరాలు విజయవంతమయ్యాయి. 


టీకాలు వేసుకోండి

ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ మేల్‌మరువత్తూరులో రోడ్డు ప్రమాద బాధితులకు ప్రాణరక్షణ పథకం ప్రారంభించేందుకు వెళుతూ గుడు వాంజేరి వద్ద నిర్వహిస్తున్న టీకాల శిబిరాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సందర్బంగా టీకాలు వేసుకున్న మహిళలను పలకరించారు. ఓ మహిళ తాను రెండో డోసు టీకా వేసుకున్నట్టు చెప్పగానే స్టాలిన్‌ ఆమెను అభినందించారు. ఇదే విధంగా అంద రూ రెండు డోసుల టీకాలు వేసుకో వాలని, అప్పుడే కరోనా వైరస్‌ ఎన్ని రూపాలు సంతరించుకుని వ్యాప్తించినా ప్రజలు ప్రాణాపాయం నుండి బయటపడగలుగుతారని చెప్పారు. స్టాలిన్‌తో పాటు మంత్రులు ఎం. సుబ్రమణ్యం, దామోఅన్బరసన్‌, కేఎన్‌ నెహ్రూ తదితరులు పరిశీలించారు. ఇదేవిధంగా రాయపురం పీఆర్‌ఎన్‌ గార్డెన్‌ ప్రాంతంలో ఏర్పాటైన టీకాల శిబిరాన్ని దేవాదాయ శాఖ మంత్రి పీకే శేఖర్‌బాబు, గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ కమిషనర్‌ గగన్‌దీప్‌ సింగ్‌బేదీ తదితరులు పరిశీలించారు.

Updated Date - 2021-12-19T16:42:51+05:30 IST