బోయపాటి దర్శకత్వంలో మెగాస్టార్ ?

Dec 6 2021 @ 10:10AM

టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను .. లేటెస్ట్ గా ‘అఖండ’ చిత్రంతో భారీ బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్నారు. యూఎస్ లో సైతం మంచి వసూళ్ళు రాబడుతున్న ఈ సినిమా జోరు ఇంకా కొనసాగుతోంది. ఈ మూవీ సక్సెస్ తో బోయపాటి పేరు టాలీవుడ్ లోనే కాకుండా.. అన్ని వుడ్స్ లోనూ మారుమోగిపోతోంది. ఈ నేపథ్యంలో బోయపాటితో మెగాస్టార్ ఓ సినిమా చేయాలని చాలా ఆసక్తిగా ఉన్నారట. నిజానికి ఈ ఇద్దరి కాంబినేషన్ లోని మూవీ.. ‘అఖండ’ చిత్రానికి ముందే రావాలి. అయితే అప్పట్లో  కొన్ని కారణాల వల్ల వర్కవుట్ కాలేదు. ‘అఖండ’ చిత్రం భారీ విజయం సొంతం చేసుకున్న నేపథ్యంలో బోయపాటి దర్వకత్వంలో తను కూడా ఓ సినిమా చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారట. 


ప్రస్తుతం ‘అఖండ’ గ్రాండ్ సక్సెస్ ను తనివి తీరా  ఎంజాయ్ చేస్తున్న బోయపాటి..  త్వరలోనే చిరంజీవికి కథ నెరేట్ చేయబోతున్నారట. భారీ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఈ కాంబోలో రాబోతోంది. ప్రస్తుతం ‘ఆచార్య’ చిత్రాన్ని రిలీజ్ కు రెడీ చేసిన చిరు.. ‘గాడ్ ఫాదర్, భోళాశంకర్’, బాబీ చిత్రాల్ని ఏక కాలంలో  పట్టాలెక్కించారు. ఆ తర్వాత మరో ఇద్దరు యంగ్ డైరెక్టర్స్ తో చిరు సినిమాలు చేయబోతున్నారు. ఇవి కంప్లీట్ అయ్యే లోపు చిరంజీవి బోయపాటి చిత్రాన్ని కూడా ట్రాక్ పై పెట్టాలనుకుంటున్నారు. మరి ఈ ఇద్దరి కాంబో మూవీ ఎప్పుడు కార్యరూపం దాల్చుతుందో చూడాలి. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.