కన్నుల పండుగగా YSRCP ఎంపీ బాలశౌరి కుమారుని వివాహం

ABN , First Publish Date - 2021-12-28T16:09:04+05:30 IST

మచిలీపట్నం వైసీపీ ఎంపీ బాలశౌరి కుమారుడు అనుదీప్ వివాహం అంగరంగ వైభవంగా...

కన్నుల పండుగగా YSRCP ఎంపీ బాలశౌరి కుమారుని వివాహం

న్యూ ఢిల్లీ/కృష్ణా : మచిలీపట్నం వైసీపీ ఎంపీ బాలశౌరి కుమారుడు అనుదీప్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో గల ప్రముఖ ప్యాలెస్ నందు స్నికితతో అనుదీప్ పెళ్లి సోమవారం తెల్లవారు జామున ఘనంగా జరిగింది. ఈ మధ్య కాలంలో సెలెబ్రిటీల వివాహాలన్ని డెస్టినేషన్ వెడ్డింగ్ రూపంలో జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. రెండు రోజులు పాటు ఘనంగా జరిగిన వేడుకలలో భాగంగా సంగీత్, హల్ది, పెండ్లి కొడుకు, పెళ్లి కూతురు రిసెప్షన్‌తో పాటు వివాహ వేడుకలు రంగ రంగ వైభవంగా జరిగి ఆహుతులను అలరించాయి.


ఫొటోల కోసం క్లిక్ చేయండి


ఈ వేడుకలో సినీ, రాజకీయ, వ్యాపారవేత్తలతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ వివాహానికి ముఖ్య అతిథులుగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి దంపతులు సతీసమేతంగా హాజరై నూతన వధూవరులను అశ్వీరదించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రివర్యులు పేర్ని నానితో పాటు, అరకు ఎంపీ మాధవి, రాజ్యసభ సభ్యులు సీఎం. రమేష్, వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి, శాసనసభ్యులు పార్థ సారధి, అనిల్ కుమార్, సింహాద్రి రమేష్, జోగి రమేష్, రెడ్డి శాంతి, గ్రీన్ కో ఎండీ చలమల శెట్టి గోపి, ఏఏంఆర్ గ్రూప్ అధినేత మహేశ్ రెడ్డి, నిర్మాత దాసరి కిరణ్ కుమార్, ప్రముఖ పారిశ్రామికవేత్తలు శ్రీనివాస నాయుడు, విడుదల కుమార స్వామి, భైరా దిలీప్ చక్రవర్తితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.



Updated Date - 2021-12-28T16:09:04+05:30 IST