మేఘా గ్యాస్‌ పంపిణీ నెట్‌వర్క్‌ విస్తరణ

ABN , First Publish Date - 2021-04-23T06:28:36+05:30 IST

మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ (ఎంఈఐఎల్‌) సిటీ గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌ నెట్‌వర్క్‌ను విస్తరించనుంది. ఈ ఏడాది చివరి నాటికి తెలంగాణ జిల్లాలు అన్నింటిలో...

మేఘా గ్యాస్‌ పంపిణీ నెట్‌వర్క్‌ విస్తరణ

హైదరాబాద్‌ (ఆంధ్రజోతి  బిజినెస్‌): మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ (ఎంఈఐఎల్‌) సిటీ గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌ నెట్‌వర్క్‌ను విస్తరించనుంది. ఈ ఏడాది చివరి నాటికి తెలంగాణ జిల్లాలు అన్నింటిలో గ్యాస్‌ పంపిణీని ప్రారంభించనుంది. ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలు, తెలంగాణ, కర్ణాటకల్లో నేచురల్‌ గ్యాస్‌ (పీఎన్‌జీ, సీఎన్‌జీ) పంపిణీకి పెట్రోలియం గ్యాస్‌ రెగ్యులేటరీ బోర్డు నుంచి మేఘా అనుమతి పొందింది. మేఘా గ్యాస్‌ పేరుతో వ్యక్తిగత, వాణిజ్య, పారిశ్రామిక, ఆటోమొబైల్‌ రంగాలకు నేచురల్‌ గ్యాస్‌ను సరఫరా చేస్తోంది. 

Updated Date - 2021-04-23T06:28:36+05:30 IST