
శ్రీనగర్: కశ్మీరీ పండిట్ రాహుల్ భట్ హత్యను వ్యతిరేకిస్తూ నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో Peoples Democratic Party అధినేత Mehbooba Mufti సంచలన వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కశ్మీర్లో హింస రగలడానికి కారణం Vivek Agnihotri చిత్రించిన The Kashmir Files సినిమానేనని ఆమె అన్నారు. తాను అధికారంలో ఉన్నప్పుడు కశ్మీరీ పండిట్ల భద్రత కోసం పని చేశామని, కానీ ఇప్పుడు పరిస్థితులు అలా లేవని మెహబూబా అన్నారు. ‘‘మేం అధికారంలో ఉన్నప్పుడు ఒక్క కశ్మీరీ పండిట్ కూడా హత్యకు గురవ్వలేదు. వారి భద్రతకు మేము కట్టుబడి పని చేశాం. కానీ వాళ్లు (కేంద్ర ప్రభుత్వం) హిందూ-ముస్లింల మధ్య అసహజ వాతావరణం తయారు చేస్తున్నారు. జ్ఞానవాపి మసీదు అంశం కూడా అలాంటిదే. ఇది ఇంతటితో ఆగకపోవచ్చు. ఎన్ని మసీదుల మీద కన్ను పడిందో లిస్ట్ ఇవ్వండి. మా దేవుడిని ఎక్కడ ఉండైనా కొలుచుకుంటాం’’ అని మెహబూబా అన్నారు.
ఇవి కూడా చదవండి