గృహ నిర్బంధంలో మెహబూబా ముఫ్తీ

ABN , First Publish Date - 2022-04-12T22:15:42+05:30 IST

మ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీని శ్రీనగర్‌లో సిటీలో..

గృహ నిర్బంధంలో మెహబూబా ముఫ్తీ

శ్రీనగర్: పీడీపీ అధ్యక్షురాలు, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీని  శ్రీనగర్‌ సిటీలో మంగళవారంనాడు అధికారులు గృహనిర్బంధంలోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని ఒక ట్వీట్‌లో ముఫ్తీ తెలిపారు. షోపియాన్ జిల్లాలో ఈనెల 6న దాడికి గురైన కశ్మీర్ పండిట్ కుటుంబాన్ని పరామర్శించేందుకు తాను వెళ్లాలనుకున్నానని, దీంతో తనను గృహనిర్బంధంలోకి తీసుకున్నారని అన్నారు. కశ్మీర్ ప్రజలు లోయను విడిచిపెట్టడానికి అక్కడి ప్రజల పైన, ముస్లింలపైన భారత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తప్పుడు ప్రచారం సాగిస్తోందని ఆమె ఆరోపించారు. ఈ తప్పుడు ప్రచారం బయటపడకుండా కట్టడి చేస్తోందని తప్పుపట్టారు. కాగా, సెక్యూరిటీ కారణాల వల్లే అనంతనాగ్ జిల్లాకు వెళ్లకుండా మెహబూబా ముఫ్తీని అదుపులోనికి తీసుకున్నట్టు అధికారులు తెలిపారు.

Updated Date - 2022-04-12T22:15:42+05:30 IST