సాగు, తాగునీటిపై సభ్యుల ధ్వజం

ABN , First Publish Date - 2021-03-07T03:54:07+05:30 IST

లక్షెట్టిపేట మండల సర్వ సభ్య సమావేశం రసాభాసగా కొనసాగింది.

సాగు, తాగునీటిపై సభ్యుల ధ్వజం
లక్షెట్టిపేట ఎంపీపీ సమావేశంలో నీటి పారుదల శాఖ అధికారిని ప్రశ్నిస్తున్న ఎంపీటీసీ స్వప్న

రసాభాసగా లక్షెట్టిపేట మండల సమావేశం 

లక్షెట్టిపేట, మార్చి 6: లక్షెట్టిపేట మండల సర్వ సభ్య సమావేశం రసాభాసగా కొనసాగింది. శనివా రం ఎంపీపీ అన్నం మంగ అధ్యక్షతన నిర్వహించగా పలు శాఖల అధికారులు నివేదికలను చదివి విని పించారు. ఎంపీటీసీలు, సర్పంచ్‌లు గ్రామాలలో సమస్యలు పరిష్కారం కావడం లేదని అధికారులపై మండిపడ్డారు. సాగు, తాగునీరుపై కాంగ్రెస్‌ ఎంపీ టీసీ, సర్పంచ్‌లు అధికారులపై అడిగే ప్రశ్నలకు అధి కార పార్టీ సభ్యులు కూడా తోడవడం విశేషం. ఒక దశలో డీసీఎంహెచ్‌ చైర్మన్‌ తిప్పని లింగన్న, జడ్పీ టీసీ ముత్తె సత్తయ్యల మధ్య గూడెం లిఫ్ట్‌ నీటి సర ఫరా విషయంలో తీవ్ర వాగ్వాదం జరిగింది. సభలో తీవ్ర గందరగోళం నెలకొనడంతో పోలీసులు సభ వైపు రావడంతో సభ్యులు ఆశ్చర్యపోయారు. సభా వేదికపైకి పోలీసులు ఎలా వచ్చారని సభ్యులు మం డిపడ్డారు. ఉన్నతాధికారులు గైర్హాజరు కావడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ విషయాన్ని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళుతానని ఎంపీడీఓ సత్యనారాయణ తెలిపారు. మిషన్‌ భగీరథపై డీఈ తన నివేదికను చదువుతూ రూ.17 కోట్ల 69 లక్షల 74 వేలతో  22 ట్యాంకులకుగాను 21 ట్యాంకులు పూర్తి చేశామని, ఇప్పటి వరకు 90 శాతం గ్రామాలకు నీటి సరఫరా జరుగుతోందని తెలుపగా కాంగ్రెస్‌ పార్టీ ప్రతినిధు లతోపాటు టీఆర్‌ఎస్‌ ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తంచేశారు. 

ఈజీఎస్‌, ఉద్యానవన శాఖకు సంబంఽ దించి సబ్సిడీ పనులపై తమకెవరికి తెలియదని కాం గ్రెస్‌ పార్టీతోపాటు టీఆర్‌ఎస్‌ ప్రతినిధులు ఆరోపిం చడంతో అధికారులు ఏం చేయాలో తెలియక సత మతమయ్యారు. సీసీ రోడ్ల విషయంలో ప్రభుత్వాధి కారులు పక్షపాత వైఖరి చూపుతున్నట్లు పలువురు సర్పంచ్‌లు ఆరోపించారు.  వైస్‌ ఎంపీపీ దేవేందర్‌ రెడ్డి,  వ్యవసాయాధికారి ప్రభాకర్‌ రెడ్డి, పంచాయతీ అధికారి అజ్మత్‌, ఎంఈవో రవీందర్‌, ఏపీఓ వెంకట రమణ, ఉద్యానవన అధికారి సహజ, పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-07T03:54:07+05:30 IST