అధికారులు హాజరుకాకపోవడంపై సభ్యుల ఆగ్రహం

ABN , First Publish Date - 2022-10-01T03:25:25+05:30 IST

ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం మండల సర్వసభ్య సమావేశం సాదాసీదాగా ముగిసింది. అధికారులు హాజరు కాకపోవ డంతో సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోనాపూర్‌, గట్రావుపల్లి, మద్దిమాడ పంచాయతీలకు చెందిన ఉపాధిహామీ కూలీలు డబ్బులు రాకపోవడంతో సమా వేశం హాలులోకి దూసుకువచ్చారు. అరగంటపాటు అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఏపీవో నవీన్‌ నెల రోజుల్లో సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇవ్వ డంతో ఆందోళన విరమించారు.

అధికారులు హాజరుకాకపోవడంపై సభ్యుల ఆగ్రహం
ఏపీవో నవీన్‌తో వాగ్వాదం చేస్తున్న ఉపాధి కూలీలు

కాసిపేట, సెప్టెంబరు 30: ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం మండల సర్వసభ్య సమావేశం సాదాసీదాగా ముగిసింది. అధికారులు హాజరు కాకపోవ డంతో సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోనాపూర్‌, గట్రావుపల్లి, మద్దిమాడ పంచాయతీలకు చెందిన ఉపాధిహామీ కూలీలు డబ్బులు రాకపోవడంతో  సమా వేశం హాలులోకి దూసుకువచ్చారు. అరగంటపాటు అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఏపీవో నవీన్‌ నెల రోజుల్లో సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇవ్వ డంతో ఆందోళన విరమించారు. ధర్మారావుపేట ఎంపీటీసీ మల్లేష్‌ మాట్లాడుతూ రెండో విడత గొర్రెల పంపిణీ ఇంకా పూర్తి కాలేదని, మూడో విడత గొర్రెలకు డీడీలు కట్టాలని అధికారులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఏ గ్రామంలో మిషన్‌ భగీరథ నీరు  సరఫరా కావడం లేదని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశా రు. ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ వినయ్‌ మాట్లాడుతూ పైపులైన్‌ మరమ్మతు జరుగు తుందని, నెల రోజుల్లో నీరందిస్తామన్నారు. విద్యుత్‌ ఏఈ సాయి మాట్లాడుతూ 101 యూనిట్లలోపు కరెంటు వినియోగించుకున్న ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు ప్రభు త్వం సబ్సిడీ అందిస్తుందని, సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎంపీపీ రొడ్డ లక్ష్మీ మాట్లాడుతూ మండల అభివృద్ధికి సభ్యులందరు సహకరించాలన్నారు.  ఇన్‌చార్జి ఎంపీడీవో శ్రీనివాస్‌ మాట్లాడుతూ అధికారులు గైర్హాజరు కాకుండా  చూస్తానని పేర్కొన్నారు. తహసీల్దార్‌ దిలీప్‌కుమార్‌, ఎంఈవో దామోదర్‌, ఎంపీటీసీలు  పద్మ, సుమలత, రాంచందర్‌,  లక్ష్మీ,  చంద్రమౌళి, మల్లేష్‌, మడావి భీంరావు, కో ఆప్షన్‌ సిరాజ్‌ఖాన్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ నీల, సర్పంచులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-10-01T03:25:25+05:30 IST