అపరిష్కృత సమస్యలపై మండిపడ్డ సభ్యులు

ABN , First Publish Date - 2022-08-17T04:45:39+05:30 IST

తమ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరిం చమని మండల సమావేశాల్లో అధికారుల దృష్టికి తెస్తున్నా అపరిష్కృతం గా మిగిలిపోవడమేమిటని పలువురు ఎంపీటీసీ సభ్యులు మండిపడ్డా రు.

అపరిష్కృత సమస్యలపై మండిపడ్డ సభ్యులు
ఎండీయూలపై ఫిర్యాదు చేస్తున్న ఎంపీటీసీ దామోదరం

 ఎండీయూలు నిరర్థకంగా మారాయంటూ ధ్వజం వాడీవేడిగా పీలేరు మండల సర్వసభ్య సమావేశం 

పీలేరు, ఆగస్టు 16: తమ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరిం చమని మండల సమావేశాల్లో అధికారుల దృష్టికి తెస్తున్నా అపరిష్కృతం గా మిగిలిపోవడమేమిటని పలువురు ఎంపీటీసీ సభ్యులు  మండిపడ్డా రు. పీలేరు ఎంపీడీవో కార్యాలయంలో  ఎంపీపీ కంభం సతీశ్‌రెడ్డి అధ్యక్ష తన మంగళవారం మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్ర మానికి ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా బాలంవారిపల్లె ఎంపీటీసీ దామోదరం మాట్లాడుతూ తమ సచివాలయ పరిధిలో వెటర్నరీ సహాయకుడు లేకపోవడంతో రోగా ల బారిన పడిన పశువుల చికిత్స కోసం పీలేరుకు తీసుకురావాల్సి వస్తోం దన్నారు. ఈ సమస్యను వారం రోజుల్లోగా పరిష్కరిస్తామని గత సమావే శంలో పశుసంవర్థక శాఖ అధికారులు హామీ ఇచ్చినప్పటికీ ఇంత వరకు పరిష్కరించలేదన్నారు. పీలేరు ఎంపీటీసీ నరసింహారెడ్డి, ఎర్రగుంట్లపల్లె ఎంపీటీసీ అమరనాథరెడ్డి, సర్పంచు చంద్రారెడ్డి మాట్లాడుతూ తమ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఇళ్ల మధ్యలో ఉన్న ప్రమాదకర 11 కేవీ లైన్లు మార్చమని గత సమావేశాల్లో కోరినా ట్రాన్స్‌కో అధికారులు పట్టిం చుకోవడం లేదన్నారు. మొబైల్‌ డిస్పెన్సరీ యూనిట్ల(ఎండీయూ)ల ద్వారా పంపిణీ చేస్తున్న రూ.1 కిలో బియ్యం గ్రామాల్లో సక్రమంగా సరఫరా కావడం లేదని తద్వారా కూలి పనులు చేసుకునే సామాన్య జనం బియ్యం కోసం పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొందన్నారు.  నిరర్థకంగా మారిన ఎండీయూలను రద్దు చేసి డీలర్ల ద్వారా బియ్యం పంపిణీ చేయాలని తహసీల్దార్‌ రవిని కోరారు. 

భూపంపిణీపై దృష్టి సారించండి 

సుదీర్ఘ విరామం తరువాత ప్రభుత్వం చేపట్టనున్న భూపంపిణీపై ప్రజా ప్రతినిధులు దృష్టి సారించాలని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పేర్కొ న్నారు. దీనిపై ప్రజాప్రతినిధులు అర్హులైన రైతుల్ని గుర్తించాలన్నారు.  కార్యక్రమంలో జడ్పీ కో-ఆప్షన్‌ సభ్యుడు షామియాన షఫీ, ఎంపీడీవో డాక్టర్‌ మురళీమోహన్‌ రెడ్డి, తహసీల్దారు రవి, సింగిల్‌ విండో అధ్యక్షుడు బీడీ నారాయణరెడ్డి, వైస్‌-ఎంపీపీలు హరిత, ఎన్వీ చలపతి, మండల కో- ఆప్షన్‌ రెడ్డిబాషా, పీలేరు సర్పంచ్‌ డాక్టర్‌ హబీబ్‌ బాషా,  ఎంపీటీసీలు శంక రనారాయణ, మూడే కృష్ణమ్మ, అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-17T04:45:39+05:30 IST