ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై సభ్యుల అసంతృప్తి

ABN , First Publish Date - 2021-02-28T06:04:17+05:30 IST

మండల కేంద్రంలో పలు చోట్ల విలువైన ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతమవుతున్నా సంబంధిత అధికారులు చేష్టలుడిగి చూస్తున్నారని మండల సభలో ఇద్దరు ఎంపీటీసీ సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై సభ్యుల అసంతృప్తి
సమస్యను సభ దృష్టికి తెస్తున్న ఎంపీటీసీ పాశం శ్రీనివా్‌సరెడ్డి

 అధికారుల తీరుపై జడ్పీ చైర్మన్‌ అసహనం
నార్కట్‌పల్లి, ఫిబ్రవరి 28 :
మండల కేంద్రంలో పలు చోట్ల విలువైన ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతమవుతున్నా సంబంధిత అధికారులు చేష్టలుడిగి చూస్తున్నారని మండల సభలో ఇద్దరు ఎంపీటీసీ సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్‌రెడ్డి అధ్యక్షతన శనివారం జరిగిన నార్కట్‌పల్లి మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశానికి జడ్పీ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హాజరయ్యారు. సమావేశంలో భాగంగా రెవెన్యూ శాఖపై సమీక్ష వచ్చిన సందర్భంలో నార్కట్‌పల్లి-2, 3 ఎంపీటీసీ సభ్యులు పుల్లెంల ముత్తయ్య, పాశం శ్రీనివా్‌సరెడ్డి మాట్లాడుతూ సర్వే నెంబర్‌ 479, 480, 481లతో పాటు తదితర ప్రభుత్వానికి చెందిన భూములు కబ్జాకు గురవుతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వ్యవసాయ శాఖాధికారికి విలువైన ప్రభుత్వ భూమిని స్వాధీనపర్చినా పరాయి వ్యక్తులు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టేవరకూ పట్టించుకోని ఏవో తీరుపై జడ్పీ చైర్మన్‌ అసహనం వ్యక్తం చేశారు. సమావేశంలో వైస్‌ఎంపీపీ కల్లూరి యాదగిరి, తహసీల్దార్‌ పొడపంగి రాధ, ఎంపీడీవో సాంబశివరావు పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-28T06:04:17+05:30 IST