తల్లిదండ్రులు కాబోతున్నట్టు ప్రకటించడంతో Alia Bhatt, రణ్‌బీర్ కపూర్‌లపై నెట్టింట హల్‌చల్ చేస్తున్న మీమ్స్

Published: Mon, 27 Jun 2022 20:30:41 ISTfb-iconwhatsapp-icontwitter-icon
తల్లిదండ్రులు కాబోతున్నట్టు ప్రకటించడంతో Alia Bhatt, రణ్‌బీర్ కపూర్‌లపై నెట్టింట హల్‌చల్ చేస్తున్న మీమ్స్

బాలీవుడ్ క్రేజీ కపుల్స్ ఆలియా భట్(Alia Bhatt), రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) ఏప్రిల్ 14న పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వివాహం అయిన మూడు నెలల్లోపే ఈ జంట తమ అభిమానులకు శుభవార్త చెప్పారు. తాము తల్లిదండ్రులు కాబోతున్నట్టు సోషల్‌మీడియా వేదికగా వెల్లడించారు. ‘మా బేబీ రాబోతుంది’ అని ఆలియా భట్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు. దీంతో ఈ జంటకు సెలబ్రిటీలతో పాటు అభిమానులు కూడా శుభాకాంక్షలు చెప్పడం మొదలుపెట్టారు. సోషల్ మీడియాలో నెటిజన్స్ మాత్రం మీమ్స్‌తో హల్‌చల్ చేస్తున్నారు. మరి వాటిపై ఓ లుక్కేద్దామా మరి..


సెలబ్రిటీ వారసుల్లో ప్రస్తుతం కరీనా కపూర్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్ కుమారుడు తైమూర్ చిన్న వాడు. మీడియా అతడి మీద చాలా ఫోకస్ చేస్తుంది. ఆలియా, రణ్‌బీర్‌ల జీవితంలోకి ఓ బేబీ వస్తే ఫొటోగ్రాఫర్స్ అందరు ఆ కిడ్‌పై ఫోకస్ చేస్తారనే కోణంలో సోషల్ మీడియాలో ఓ నెటిజన్ పోస్ట్ పెట్టారు. ‘‘ఆలియా, రణ్‌బీర్ తల్లిదండ్రులు కాబోతున్నట్టు ప్రకటించారు. తైమూర్ క్రేజ్ అపాయంలో పడింది’’ అని ఆ నెటిజన్ తెలిపారు. కరీనా కపూర్ ఖాన్ (kareena kapoor khan), ప్రియాంక చోప్రా(priyanka chopra), అనుష్క శర్మ, నటషా స్టాంకోవిక్, ఆలియా నలుపురంగు దుస్తులను ధరించిన ఫొటోను మరో నెటిజన్ పోస్ట్ చేశారు. ‘‘ఈ డ్రెస్ అనేది ప్రతి ఒక్కరికీ పనిచేస్తుంది. మీకు తెలుసా’’ అని ఆ నెటిజన్ చెప్పారు. ‘‘పెళ్లయిన మూడు నెలల్లోనే ఆలియా, రణ్‌బీర్ తల్లిదండ్రులు కాబోతున్నట్టు ప్రకటించారు. దీపిక, కత్రినా ఈ జంటను చూసి నేర్చుకోవాలి’’ అని ఓ సోషల్ మీడియా యూజర్ పోస్ట్ పెట్టారు. ‘‘ఫొటోగ్రాఫర్స్ అందరు ఆలియా ఇంటి బయట ఎదురుచూస్తున్నారు’’ అని మరో సోషల్ మీడియా యూజర్ స్పష్టం చేశారు. ‘‘తల్లిదండ్రులు అవుతారని తెలుసు. కానీ, ఇంత త్వరగా అవుతారని అనుకోలేదు’’ అని ఒకరు తెలిపారు. రణ్‌బీర్‌ని ఉద్దేశించి ‘‘వేగంతమైన మనిషి జీవించే ఉన్నారు’’ అని మరొకరు చెప్పారు. మొదటి సారిగా ఆలియా భట్, రణ్ బీర్ కపూర్ కలసి ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలో నటించారు. పాన్ ఇండియాగా భారీ బడ్జెట్‌తో కరణ్ జోహార్ నిర్మించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 9న విడుదల కానుంది. 







Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest News in Teluguమరిన్ని...