పిల్లల జ్ఞాపక శక్తి తగ్గుదలకు మరో కారణాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు... అదేమిటంటే..

ABN , First Publish Date - 2022-06-09T15:07:52+05:30 IST

బడికి వెళ్లే సమయంలో స్కూల్ రూట్‌లో...

పిల్లల జ్ఞాపక శక్తి తగ్గుదలకు మరో కారణాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు... అదేమిటంటే..

బడికి వెళ్లే సమయంలో స్కూల్ రూట్‌లో రద్దీ ఎక్కువగా ఉంటే పిల్లల జ్ఞాపకశక్తి బలహీనపడుతుందని తేలింది. స్పెయిన్‌లోని బార్సిలోనా ఇన్‌స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ పరిశోధకులు బార్సిలోనాలోని 38 పాఠశాలల్లో చదువుతున్న పిల్లలపై పరిశోధనలు చేశారు. 7 నుండి 10 సంవత్సరాల వయస్సు గల 2,680 మంది పిల్లలపై చేసిన ఈ పరిశోధనలో, బాహ్య శబ్దం స్థాయిలో 5 డెసిబుల్స్ పెరుగుదల కూడా జ్ఞాపకశక్తి సామర్థ్యాన్ని 11.5% తగ్గిస్తుందని కనుగొన్నారు. అదే సమయంలో కష్టమైన పనులను చేయగల సామర్థ్యం కూడా 23.5% ప్రభావితమవుతుంది. 


దీని కారణంగా చదువుపై దృష్టి 4.8% మేరకు తగ్గుతుంది. ఈ పరిశోధనలో పాల్గొన్న జోర్డి సన్యెర్ మాట్లాడుతూ బాల్యం హాని కలిగించే కాలంగా మారిందనే సిద్ధాంతానికి మా పరిశోధన మద్దతునిస్తుంది. శబ్ధ కాలుష్యం వల్ల కౌమారదశకు ముందు వచ్చే జ్ఞాపకశక్తి అభివృద్ధి ప్రక్రియ మందగిస్తుంది. భవిష్యత్తులో దీనిని దృష్టిలో ఉంచుకుని, తక్కువ శబ్దం, తక్కువ ట్రాఫిక్ ఉన్న ప్రదేశంలో పాఠశాలలను ఏర్పాటు చేయాలి. అవుట్‌డోర్, ఇండోర్ శబ్దాలను పోల్చి చూస్తే, శబ్ధాలు వినిపిస్తున్న ప్లేగ్రౌండ్‌లు ఉన్న పాఠశాలల్లోని పిల్లలు అన్ని పరీక్షలలో పేలవమైన ప్రదర్శన చూపారని పరిశోధకులు కనుగొన్నారు. అయినప్పటికీ ధ్వని వినిపించే తరగతుల్లో కూర్చొనే పిల్లల దృష్టిపై మాత్రమే ప్రభావం పడుతుందని, వారి జ్ఞాపకశక్తిపై కాదన్నారు. డాక్టర్ మరియా ఫోస్టర్ మాట్లాడుతూ, సగటు డెసిబెల్ స్థాయిల కంటే ఎక్కువ ఇండోర్ శబ్ధం నరాల అభివృద్ధికి ముప్పుగా పరిణమించవచ్చన్నారు. కాలుష్యం, ట్రాఫిక్ అధికంగా ఉన్న ప్రాంతాల పిల్లలు ఊబకాయంతో బాధపడుతున్నారన్నారు. 

Updated Date - 2022-06-09T15:07:52+05:30 IST