ఏరోబిక్స్‌తో జ్ఞాపకశక్తి!

Published: Tue, 16 Aug 2022 11:04:22 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఏరోబిక్స్‌తో జ్ఞాపకశక్తి!

ఏరోబిక్‌ వ్యాయామాల వల్ల జ్ఞాపకశక్తికి సంబంధించిన మెదడులోని కొన్ని ప్రదేశాలకు రక్తప్రసారం పెరిగి, తద్వారా జ్ఞాపకశక్తి మెరుగవుతున్నట్టు పరిశోధనల్లో తేలింది. అల్జీమర్స్‌ డిసీజ్‌ జర్నల్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనంలో ఏరోబిక్స్‌తో పెరిగే రక్తప్రసారం వల్ల వృద్ధుల్లో తలెత్తే మతిమరుపు సమస్యలు తగ్గుముఖం పడతాయని పేర్కొన్నారు. ఈ అధ్యయనం ఆధారంగా మెదడులో జ్ఞాపకశక్తితో సంబంధం ఉన్న ప్రదేశాలకు రక్తప్రసారాన్ని మెరుగుపరిచే మందులు కనుగొనడం ద్వారా, అల్జీమర్స్‌ వ్యాధికి చికిత్స అందించే వెసులుబాటు కలిగిందని యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సా్‌సకు చెందిన శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు.


ఈ అధ్యయనం కోసం 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న 30 మందిపై ప్రయోగాలు జరిగాయి. వీరిలో సగం మందితో ఏడాది పాటు ఏరోబిక్‌ వ్యాయామాలు, మిగతా సగం మందితో సాధారణ వ్యాయామాలు చేయించారు. ఆ ప్రయోగాల్లో ఏరోబిక్‌ వ్యాయామాలు చేసిన వారి మెదడులో రక్తప్రసారాల్లో మార్పులు, తద్వారా జ్ఞాపకశక్తిలో చోటుచేసుకునే తేడాలను పరిశీలించడం జరిగింది.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.