మగవాళ్ల పండుగ

ABN , First Publish Date - 2022-01-10T02:19:31+05:30 IST

కడప జిల్లాలోని పుల్లంపేట మండలం తిప్పాయపల్లెలోని సంజవరాయస్వామికి ఓ ప్రత్యేకత ఉంది. సంజీవరాయునికి ఆలయం లేకపోయినా రాతిశిల రూపంలో ఉన్న

మగవాళ్ల పండుగ

పుల్లంపేట: కడప జిల్లాలోని పుల్లంపేట మండలం తిప్పాయపల్లెలోని సంజవరాయస్వామికి ఓ ప్రత్యేకత ఉంది. సంజీవరాయునికి ఆలయం లేకపోయినా రాతిశిల రూపంలో ఉన్న సంజీవరాయుడికి ఏటా సంక్రాంతికి ముందు వచ్చే ఆదివారం మగవాళ్లు పొంగళ్లు పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. పుల్లంపేట మండలం తిప్పాయపల్లె గ్రామంలో ప్రతి ఏడాది సంక్రాంతి ముందు వచ్చే ఆదివారం సంజీవరాయునికి పొంగళ్లు పెడతారు. సంక్రాంతి కంటే ఈ పొంగళ్ల కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకోవడమే కాక మగవాళ్లు ఎక్కడ ఉన్నా సంజీవరాయుడి పొంగళ్లకు వచ్చి పొంగుబాళ్లు పెడుతుంటారు.


ఇంటి దగ్గర నుంచి పొంగళ్లకు కావాల్సిన సామాగ్రిని ఆలయానికి తీసుకువచ్చి పొంగళ్లు పెట్టి స్వామి వారికి నైవేద్యం సమర్పిస్తారు. ఆలయంలోకి మహిళలకు ప్రవేశం లేదు. అలాగే స్వామి వారికి సమర్పించిన నైవేద్యాన్ని కూడా మహిళలు ముట్టరు. ఆలయం బయటి నుంచే సంజీవరాయుడిని దర్శించుకున్నారు. సంజీవరాయునికి ఆలయం లేదు. ఓ రాతిశిలపై చెక్కిన లిపినే ఇక్కడ సంజీవరాయుడిగా కొలిచి పొంగళ్లు పెట్టి పూజలు చేస్తారు. స్వామి వారికి కొబ్బరి, బెల్లం కానుకలుగా సమర్పిస్తారు. సంజీవరాయునికి పొంగళ్లు పెడితే గ్రామం సుభిక్షంగా ఉంటుందని, దుష్టశక్తులు గ్రామంలో దరిచేరవని, పాడిపంటలు అభివృద్ధి చెందుతాయని ఇక్కడి ప్రజల విశ్వాసం. 

Updated Date - 2022-01-10T02:19:31+05:30 IST