మానసిక ఆరోగ్యమూ ముఖ్యమే!
ABN , First Publish Date - 2021-02-23T20:10:50+05:30 IST
సామాజిక దూరం పాటించడం, ఫేస్ మాస్క్ ధరించడం, చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవడం... ద్వారా కొవిడ్ బారిన పడకుండా తప్పించుకోవచ్చని మాత్రమే మనకు తెలుసు. అయితే కొవిడ్ నుంచి సంపూర్ణ రక్షణ పొందాలంటే మానసిక రుగ్మతలు కూడా లేకుండా
ఆంధ్రజ్యోతి(23-02-2021)
సామాజిక దూరం పాటించడం, ఫేస్ మాస్క్ ధరించడం, చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవడం... ద్వారా కొవిడ్ బారిన పడకుండా తప్పించుకోవచ్చని మాత్రమే మనకు తెలుసు. అయితే కొవిడ్ నుంచి సంపూర్ణ రక్షణ పొందాలంటే మానసిక రుగ్మతలు కూడా లేకుండా చూసుకోవాలి. డిప్రెషన్, ఎ.డి.హెచ్.డి, బైపోలార్ డిజార్డర్ లాంటి మానసిక రుగ్మతలు కలిగినవారు కొవిడ్ బారిన పడే అవకాశాలు ఎక్కువ. వీరిలో స్కిజోఫ్రేనియా, అటెన్షన్ డెఫిసిట్/హైపర్ యాక్టివిటీ డిజార్డర్, మేజర్ డిప్రెసివ్ డిజార్డర్లు కలిగినవాళ్లకు ప్రమాదం రెట్టింపుగా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఈ కోవకు చెందినవారికి కొవిడ్ టీకా ఇప్పించడం అత్యవసరమని వారంటున్నారు.