కదలడంతోనే మానసికారోగ్యం!

ABN , First Publish Date - 2022-05-12T17:36:16+05:30 IST

నడక, వ్యాయామాలు, యోగా.. లాంటివి కేవలం శారీరక ఆరోగ్యం కోసమే కాదు.. మానసిక ఆరోగ్యానికీ మంచిదే. వర్కవుట్స్‌ వల్ల మానసిక సమస్యలూ దూరమౌతాయని తాజా అధ్యయనంలో తేలింది.

కదలడంతోనే మానసికారోగ్యం!

ఆంధ్రజ్యోతి(12-05-2022)

నడక, వ్యాయామాలు, యోగా.. లాంటివి కేవలం శారీరక ఆరోగ్యం కోసమే కాదు.. మానసిక ఆరోగ్యానికీ మంచిదే. వర్కవుట్స్‌ వల్ల మానసిక సమస్యలూ దూరమౌతాయని తాజా అధ్యయనంలో తేలింది.


శరీరాన్ని చురుగ్గా, శక్తివంతంగా ఉంచుకోవటానికి ఆహారంతో పాటు నడక అత్యవసరం. ఏదో యాక్టివిటీ ఉండాల్సిందే. లేకుంటే శరీరంలో కొవ్వుశాతం పెరుగుతుంది. అనేక సమస్యలొస్తాయి. ప్రపంచంలో 500 మిలియన్ల మంది డిప్రెషన్‌, యాంగ్జయిటీ సమస్యలతో బాధపడుతున్నారు. ఇంత భారీ సంఖ్యకు కారణం కరోనానే. కరోనా సమయంలోనే కాకుండా.. ఆ తర్వాత కూడా కరోనా వివిధ వేరియంట్స్‌లో వస్తుందనే భయంతో బాధపడేవాళ్లు నానాటికీ పెరిగిపోతున్నారట. ఇదే మానసిక సమస్యలకు దారి తీస్తోంది. మంచి విషయం ఏంటంటే.. శారీరక వ్యాయమాలైన నడక, రన్నింగ్‌ లేదా సైక్లింగ్‌, స్ర్టెంగ్త్‌ ట్రైనింగ్‌ చేసేవాళ్లకు మానసిక రోగాలు దరిచేరే అవకాశాలు తక్కువే అంటూ తాజాగా ఓ అధ్యయనం వచ్చింది. స్వీడన్‌లోని ఓ విశ్వవిద్యాలయంలో ఈ సర్వే చేశారు పరిశోధకులు.


ప్యాండమిక్‌లో భయపడిన వాళ్లు, యాంగ్జయిటీ, డిప్రెషన్‌ ఉండేవాళ్లను పన్నెండు వారాల పాటు ఏరోబిక్స్‌, స్ర్టెంగ్త్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రామ్‌ చేశారు. ఆ తర్వాత ఇందులో రోజుకు గంట చొప్పున వారానికి కనీసం మూడుసార్లు ఈ శిక్షణలో పాల్గొన్న 75 శాతం మంది హార్ట్‌బీట్‌ను పరిశీలిస్తే రిలాక్స్‌గా ఉంది. వారిలో అనూహ్యంగా యాంగ్జయిటీ సమస్య తగ్గుముఖం పట్టిందని పరిశోధకులు తేల్చేశారు. అమెరికాలో చేసిన మరో అధ్యయనం ఏంటంటే.. అది ఆఫీసులో కావొచ్చు, ఇంట్లో కావొచ్చు.. ఒకే చోటకు పరిమితమైన వాళ్లకు ప్యాండమిక్‌ తర్వాత కూడా మానసిక సమస్యలు ఉన్నాయని తేల్చింది. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లటం, రెగ్యులర్‌గా కనీసం నడవటం, తేలికపాటి ఎక్సర్‌సైజ్‌లు చేసినవారికి ఆందోళన తగ్గిపోయిందట. ఎక్సర్‌సైజ్‌లు చేస్తే ఎండార్ఫిన్‌  విడుదలవుతుంది. దీంతో పాటు మెదడుకు రక్తప్రసరణ జరుగుతుంది. దీనివల్ల మూడ్‌ను నియంత్రిస్తుంది. ప్రతికూల ఆలోచనలు తగ్గిపోతాయి. అందుకే వ్యాయామాలు కేవలం శరీరంకోసమే కాదు.. మానసికం ఆరోగ్యం కోసం కూడా అని గుర్తుంచుకోవాలి.

Read more