క్రీడలతో మానసిక ఉల్లాసం

ABN , First Publish Date - 2022-06-29T05:53:17+05:30 IST

క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతోందని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పే ర్కొన్నారు.

క్రీడలతో మానసిక ఉల్లాసం
క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి

- ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి 

- క్రీడా ప్రాంగణాలు ప్రారంభం

నర్వ, జూన్‌ 28 : క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతోందని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పే ర్కొన్నారు. మంగళవారం మండల కేంద్రంతోపాటు జక్కన్నపల్లె, కొత్తపల్లె, సీపూర్‌, నర్వ కస్తూర్బా గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలను ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. ఈ సందర్భంగా నర్వ మండల కేంద్రం నుంచి జక్కన్నపల్లె వరకు బీటీ రోడ్డు మంజూరు చేయాలని గ్రామస్థులు ఎమ్మెల్యేను కోరగా స్పందించిన ఎమ్మెల్యే మండల కేంద్రం నుంచి కొన్ని గ్రామాలకు బీటీ రోడ్లు మంజూరయ్యాయని టెండర్లు వేసి త్వరలోనే బీటీ రోడ్డు పనులు ప్రారంభిస్తామని తెలిపారు. కార్యక్ర మంలో ఎంపీపీ జయరాములు శెట్టి, జడ్పీటీసీ సభ్యురాలు జ్యోతి, సర్పంచ్‌ పెద్దింటి సంద్య, వైస్‌ ఎంపీపీ వీణావతి, ఆయా గ్రామాల సర్పంచులు కోట్ల నాగిరెడ్డి, సుజాత, కేజీబీవీ ఎస్‌వో శిల్ప, టీఆర్‌ఎస్‌ నాయకుడు మండ్ల చిన్నయ్య, విండో వైస్‌ చైర్మన్‌ లక్ష్మన్‌, గడ్డం నర్సింహ్మ పాల్గొన్నారు.

సీఐకి సన్మానం

మక్తల్‌ : దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు జయంతి సందర్భంగా మక్తల్‌ సీఐ సీతయ్య పీవీ నర్సింహారావు ప్రైడ్‌ ఇండియా పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా మంగళవారం పట్టణంలోని ఎమ్మెల్యే స్వగృహంలో సీఐ సీతయ్యను ఎమ్మెల్యే శాలువాతో సన్మానించారు. అదే విధంగా విశ్రాంత ఉద్యోగులకు 400 గజాల స్థలం కేటా యించాలని కోరుతూ రిటైర్డ్‌ ఉద్యోగులు ఎమ్మెల్యేకు వినతిపత్రం అందించారు. ఆయా కార్యక్రమాల్లో ఆ సంఘం అధ్యక్షుడు రిటైర్డ్‌ పీఈటీ గోపాలం, ప్రధా న కార్యదర్శి భాస్కర్‌  దండు వెంకట్‌రెడ్డి, తులిశ ప్ప, సిద్దిలింగయ్య, కిష్టయ్యగౌడ్‌, జగదీష్‌కుమార్‌ గౌడ్‌, సిద్ది రాములు, రమేష్‌రావు, సత్యనారాయణ, రాఘవేందర్‌రావు, సూర్యప్రకాష్‌, నర్సయ్య, నాగప్ప, సాయిరెడ్డి, కృష్ణయ్య, మాగనూరు మండలాధ్యక్షుడు ఎల్లారెడ్డి, నాయకులు శేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. 

ఇన్సూరెన్స్‌ చెక్కు అందజేత 

మక్తల్‌ రూరల్‌ : మండలంలోని పారేవుల గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్‌ కార్యకర్త ముష్టి చెన్నప్ప రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ముష్టి చెన్నప్పకు పార్టీ సభ్యత్వం ఉండటంతో మంజూరైన రెండు లక్షల రూపాలయ చెక్కును మంగళవారం ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి బాధిత కుటుంబా నికి అందజేశారు. టీఆర్‌ఎస్‌ నాయకుడు మహిపా ల్‌రెడ్డి, సర్పంచు వెంకటేశ్వర్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు ఆశిరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2022-06-29T05:53:17+05:30 IST