తెరపైకి ఓటీఎస్‌ కత్తి

Published: Wed, 29 Jun 2022 23:35:20 ISTfb-iconwhatsapp-icontwitter-icon
తెరపైకి ఓటీఎస్‌ కత్తి

రెగ్యులర్‌ సమీపిస్తుండగా నకిలీ చలానాల ప్రస్తావన
నాడు భరోసా.. నేడు సంబంధం లేదన్న ఉన్నతాధికారులు
అగమ్యగోచరంగా సచివాలయ ఉద్యోగుల భవిష్యత్తు
కలెక్టర్‌ నిర్ణయమే శిరోధార్యం
(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)   

సచివాలయ ఉద్యోగుల మెడపై ఇప్పుడు ‘ఓటీఎస్‌’ కత్తి వేలాడుతోంది. క్రమబద్ధీకరణ సమీపిస్తున్న వేళ నకిలీ చలానాలకు వారే బాధ్యులంటూ ప్రభుత్వం కొత్త అస్త్రం తెరపైకి తెచ్చింది. ఆ డబ్బులు వారే చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ బాధ్యతను జిల్లాల వారీగా కలెక్టర్‌లకు అప్పగించింది. రేపోమాపో రెగ్యులర్‌ అవుతున్న ఆనందంలో ఉన్న సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వ నిర్ణయం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అయితే తమను రెగ్యులర్‌ చేసే బాధ్యత కలెక్టర్‌కు అప్పగించడంతో.. కలెక్టర్‌ నిర్ణయమే శిరోధార్యంగా సచివాలయ ఉద్యోగులు భావిస్తున్నారు.
...........................................

నాడేమో గృహ నిర్మాణ లబ్ధిదారులు ఓకే అనకున్నా చలానాలు తయారు చేయాలని మౌఖిక ఆదేశా లిచ్చారు. ఇప్పుడేమో తమకు సంబంఽధం లేదంటున్నారు. పైగా ఆ డబ్బు మీరే చెల్లించాలని తప్పుకుంటున్నారు. ప్రభు త్వం, ఉన్న తాధికారుల తీరుపై సచివాలయ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు ప్రొబేషన్‌ వాయిదా వేసి ఆర్థిక భారాన్ని తగ్గించుకున్న ప్రభుత్వం.. కొత్త కొత్త నిబంధనలతో ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకునేందుకు పావులు కదుపుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో భాగంగానే ఓటీఎస్‌ అస్త్రాన్ని సచివాలయ ఉద్యోగులపై ప్రయోగించిందన్న విమర్శలు ఉన్నాయి. నకిలీ చలానాలు సృష్టించా రంటూ ప్రభుత్వం నెపం మోపుతోంది. పూర్తిస్థాయి ఉద్యోగులుగా మారుతామన్న ఆశతో ఉన్నవారికి ప్రభుత్వ నిర్ణయం ఆశనిపాతంలా మారింది.

అప్పుడు భరోసా ఇచ్చి...
గతంలో ఇళ్లు కట్టుకున్న లబ్ధిదారుల నుంచి బకాయిల వసూలుకు వైసీపీ ప్రభుత్వం ఓటీఎస్‌ను ప్రవేశపెట్టింది. ఈ పథకంపై ప్రతి పక్షాలతో పాటు ప్రజల నుంచి కూడా తీవ్రస్థాయిలో వ్యతి రేకత వచ్చింది. ఎప్పుడో కట్టిన ఇళ్లకు ఇప్పుడు డబ్బులు కట్టడమేంటని చా లాచోట్ల నిలదీశారు. అయి నా వెనక్కి తగ్గని ప్రభు త్వం.. వసూళ్ల బాధ్యతను సచివాలయ ఉద్యోగులపై పెట్టింది. అంతేగాక ఓటీఎస్‌ అమలు విషయమై అధి కారులపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చింది. మండలాల వారీగా లక్ష్యాలు నిర్దేశించింది. చాలామంది లబ్ధిదారులు ఓటీఎస్‌ను తిరస్కరించారు. లబ్ధిదారులు ఓటీఎస్‌కు అంగీకరించకపోయినా వారి పేరు మీద చలానాలు తయారు చేయా లని సచివాలయ ఉద్యోగులకు ఉన్నతాధికారులు మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. దీనిపై పలు సందేహాలు వ్యక్తం చేసిన వారికి అప్పట్లో భరోసా ఇచ్చారు. ఇప్పుడేమో ఓటీఎస్‌ చలానాలకు సచివాలయ ఉద్యోగులనే బాధ్యులను చేస్తూ అప్పట్లో భరోసా ఇచ్చిన ఉన్నతాధి కారులు తప్పుకున్నారు. దీంతో ఫేక్‌ చలానాల భారం అంతా సచివా లయ ఉద్యోగులపైనే పడింది. ఇదే విషయంపై ఉన్నతాఽధికారులను కలవగా సచివాలయ పరిధిలోని ఉద్యోగులందరూ కలసి ఆ మొత్తా న్ని చెల్లించాలని సూచించినట్లు సమాచారం. ఈవిషయంలో సచివా లయ ఉద్యోగులు ఇటు ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకెళ్లలేక... అటు డబ్బులు చెల్లించ లేక సతమతమవుతున్నారు.

జమకాని నగదు రూ.30.8 లక్షలు
జిల్లాలో మొత్తం ఓటీఎస్‌ గురించి 32,959 ట్రాన్సాక్షన్స్‌ జరిగాయి. ఇందుకుగాను రూ.17,25,87,030 చెల్లించాల్సి ఉంది. ఇప్పటివరకు 4,110 చలానాలకు రూ. 16,02,53,610 జనరేట్‌ అయింది. ఇందులో 3,965 చలానాలకు రూ.15,72,45,120 జమ అయింది. ఇంకా 145 చలానాలు జనరేట్‌ అయినా.. రూ.30,08,490 చెల్లించాల్సి ఉంది. జిల్లాలో ఇంకా 4,323 చలానాలు జనరేట్‌ కాలేదు. వీటికి రూ. 1,23,33,420 జమ కావాల్సి ఉంది. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో రూ.30.8 లక్షల మేర ఓటీ ఎస్‌ నకిలీ చలానాలు తయారైనట్లు తేలింది. జిల్లావ్యాప్తంగా 4,110 చలానాలు రూ పొందించగా.. వీటిలో 145 చలానాలకు నగదు జమకా లేదు. వీటికి బాధ్యులైన సచి వాలయ ఉద్యోగుల ప్రొబేషన్‌ను నిలుపు దల చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశా లు వెలువడ్డాయి. ఆ మొత్తం జమయ్యే వరకు ప్రొబేషన్‌ను ఇవ్వకూ డదని అందు లో పేర్కొన్నారు. జిల్లాలో 732 గ్రామ, వార్డు సచివాలయాలు ఉండగా.. ఓటీఎస్‌లో భాగ స్వాములైన 371 మంది గ్రేడ్‌-5 గ్రామ కార్యదర్శులు, 1500 మంది వార్డు కార్యదర్శులు, 618 మంది డిజిటల్‌ అసిస్టెంట్లపై ఈ ప్రభావం ప డింది. అయితే చాలా సచివాలయాల్లో కార్యదర్శుల పోస్టులు ఖాళీగా ఉండడంతో వాటిలో ఇతర ఉద్యోగులను ఇన్‌ఛార్జిలుగా నియమించారు. దీంతో వీరు కూడా ఓటీఎస్‌ అమలులో భాగమయ్యారు. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం కారణంగా వీరి భవిష్యత్తు ప్రమాదంలో పడింది. కాగా, రెగ్యులర్‌ చేసే బాధ్యత కలెక్టర్‌కు అప్పగించడంతో.. ఆయన నిర్ణయం కోసం సచివాలయ ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.