‘విద్యాకానుక’లకు తల్లిదండ్రుల వివరాలు నమోదు చేయాలి

ABN , First Publish Date - 2020-12-03T05:08:49+05:30 IST

విద్యాకానుకల పంపిణీకి సంబంధించి అన్ని పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రుల వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలని ఎంఈవో దిలీప్‌కుమార్‌ అన్నారు.

‘విద్యాకానుక’లకు తల్లిదండ్రుల వివరాలు నమోదు చేయాలి
ప్రధానోపాధ్యాయుల సమావేశంలో మాట్లాడుతున్న ఎంఈవో దిలీప్‌కుమార్‌.

ఉపాధ్యాయుల సమావేశంలో ఎంఈవో దిలీప్‌కుమార్‌ 


బుచ్చిరెడ్డిపాళెం, డిసెంబరు 2: విద్యాకానుకల పంపిణీకి సంబంధించి అన్ని పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రుల వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలని ఎంఈవో దిలీప్‌కుమార్‌ అన్నారు. బుధవారం బుచ్చి మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీడీవో నరసింహారావు ఆధ్వర్యంలో మండలంలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా  పాఠశాలల్లో అమలవుతున్న ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై పలు సూచనలిచ్చారు. విద్యార్థినీ, విద్యార్థులకు పంపిణీ చేసిన బూట్లలో సైజుల తేడాలుంటే వాటికి సంబంధించి పూర్తి వివరాలు నమోదు చేసి నివేదికలతో ప్రతిపాదనలు పంపించాలని తెలిపారు. అలాగే విద్యార్థులకు పంపిణీ చేయాల్సిన కోడిగుడ్లు, బియ్యం తదితర సరుకులను ఎప్పటికప్పుడు పంపిణీ చేయాలన్నారు. పాఠశాలల్లో ఎదుర్కొంటున్న పలు సమస్యలను ప్రధానోపాధ్యాయులు ఎంఈవోకు వివరించారు. కార్యక్రమంలో రీసోర్స్‌ సభ్యుడు గండికోట సుధీర్‌కుమార్‌   పాల్గొన్నారు.

Updated Date - 2020-12-03T05:08:49+05:30 IST