IPL: ముంబై బౌలర్లకు తలవంచిన చెన్నై.. వంద కూడా దాటకుండానే ఆలౌట్

ABN , First Publish Date - 2022-05-13T02:54:04+05:30 IST

ఐపీఎల్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కుప్పకూలింది. ముంబై

IPL: ముంబై బౌలర్లకు తలవంచిన చెన్నై.. వంద కూడా దాటకుండానే ఆలౌట్

ముంబై: ఐపీఎల్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కుప్పకూలింది. ముంబై బౌలర్ల పదునైన బంతులను ఎదుర్కోలేక 97 పరుగులకే ఆలౌటైంది. డెవోన్ కాన్వే, మొయిన్ అలీ, మహీశ్ తీక్షణ డకౌట్ అయ్యారు. రుతురాజ్ గైక్వాడ్ (7), రాబిన్ ఉతప్ప (1), సిమర్‌జీత్ సింగ్ (2), ముకేశ్ చౌదరీ (4) సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.


అంబటి రాయుడు (10), శివం దూబే (10), బ్రావో (12) దారుణంగా విఫలమయ్యారు. కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ 36 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ముంబై బౌలర్లలో డేనియల్ శామ్స్ 3 వికెట్లు తీసుకోగా, మెరిడిత్, కుమార్ కార్తికేయ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. బుమ్రా, రమణ్‌దీప్ సింగ్ చెరో వికెట్ తీసుకున్నారు. ఫలితంగా చెన్నై మరో 4 ఓవర్లు మిగిలి ఉండగానే 97 పరుగులకు ఆలౌట్ అయింది.

Read more