విలీనం.. విలాపం

Nov 29 2021 @ 23:12PM
అచ్చంపేట మునిసిపాలిటీలోని ఓ కాలనీ దుస్థితి

-  మునిసిపాలిటీలలో పడకేసిన పారిశుధ్యం

-  అవుట్‌సోర్సింగ్‌ సిబ్బందితో నెట్టుకొస్తున్న పాలకవర్గాలు

- వసూలు చేస్తున్న పన్నులు జీతభత్యాలకే సరిపోతున్న వైనం

 జిల్లాలోని మునిసిపాలిటీల్లో పారిశుధ్య పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నాయి. జనాభాకు అనుగుణంగా  పారిశుధ్య సిబ్బంది లేకపోవడం,   పన్నుల రూపంలో వసూలవుతున్న డబ్బు అవుట్‌సోర్సింగ్‌ సిబ్బంది జీతభత్యాలకే సరిపోతుండడంతో ఇతరత్రా అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయలేక పాలకవర్గాలు ఇబ్బంది పడుతున్నాయి. జిల్లాలో నాగర్‌కర్నూల్‌, కొల్లాపూర్‌, అచ్చంపేట, కల్వకుర్తి మునిసిపాలిటీలు ఉండగా అన్ని చోట్ల సమస్యలే కన్పిస్తున్నాయి. 


 నాగర్‌కర్నూల్‌, (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో నాలుగు మునిసిపాలిటీలు ఉండగా ఆస్తి పన్ను రూపేణా వసూలవుతున్న డబ్బు అవుట్‌సోర్సింగ్‌ సిబ్బంది వేతనాలు, మునిసిపాలిటీల నిర్వహణకు సరి పోతోన్నాయి. నాగర్‌కర్నూల్‌ మునిసిపాలిటీలో మొత్తం 36వేల 912మంది జనాభా, 10,696 నివాస గృహాలు ఉన్నాయి. రెగ్యులర్‌ పారిశుధ్య సిబ్బంది ఏడుగురు మా త్రమే ఉండగా 80మందిని అవుట్‌సోర్సింగ్‌ విధానంలో నియమించారు. నగరపంచాయతీ నుంచి మునిసిపాలి టీగా అప్‌గ్రేడ్‌ చేసే సమయంలో శివారు పంచాయతీ లైన ఉయ్యాలవాడ, నెల్లికొండ, ఎండబెట్ల, నాగనూల్‌, దేశిటిక్యాల గ్రామాలను ఇందులో చేర్చారు. విలీన గ్రా మాల్లో సైతం పారిశుధ్య పనులు సజావుగా నిర్వహించ డానికి ఇంకా 50మంది సిబ్బంది అవసరమవుతారు. ఇందుకు తగిన ఆర్థికవనరులు లేక పోవడంతో పారి శుధ్య పనులు సజావుగా సాగడంలేదు. 

  అచ్చంపేటలో పరిస్థితి విభిన్నం 

అచ్చంపేట మునిసిపాలిటీలో పరిస్థితి చాలా విభి న్నంగా ఉంది. అచ్చంపేటకు సంబంధించి శివారు పం చాయతీలుగా ఉన్న నడింపల్లి, పులిజాల, లక్ష్మాపూర్‌, బొలెగేట్‌పల్లి, చౌటపల్లి, లింగోటం, పోలిశెట్టిపల్లి, పలక పల్లి గ్రామాలను అచ్చంపేట మునిసిపాలిటీలో విలీనం చేశారు. ప్రజల నుంచి విముఖత వ్యక్తం కావడంతో వాటిని మళ్లీ మునిసిపాలిటీ నుంచి తొలగించారు.  అ క్కడ సర్పంచ్‌ ఎన్నికలు నిర్వహించకపోవడంతో ముని సిపాలిటీ పాలకవర్గం, అధికారులు ఎవరూ పట్టించు కోక పారిశుధ్యం, నీటి సరఫరాకు సంబంధించిన అంశాలు జఠిలంగా మారాయి. 28,425మంది జనాభా, 6,425 నివాస గృహాలున్న అచ్చంపేట మునిసిపాలిటీలో కేవలం ముగ్గురు మాత్రమే రెగ్యులర్‌ పారిశుధ్య సిబ్బంది ఉండటం గమనార్హం.

 కల్వకుర్తిలో  పందుల స్వైర విహారం 

కల్వకుర్తి మునిసిపాలిటీలో తిమ్మరాసిపల్లి, సంజ్ఞా పూర్‌, కొట్ర తండాలు విలీన గ్రామాలు ఉండగా ముని సిపాలిటీ పరిధిలో 30, 091మంది జనాభా, 6,600 నివాస గృహాలు ఉన్నాయి. ఇక్కడ రెగ్యులర్‌ పారిశుధ్య కార్యక్రమాలను గాలికొదిలేశారు. 

కొల్లాపూర్‌ మునిసిపాలిటీలో మొత్తం జనాభా 23,041 ఉన్నది. చౌటబెట్ల, చుక్కాయిపల్లి, నర్సింహ్మపు రం, నర్సింగరావుపల్లి విలీన పంచాయతీలల్లో నెలకు ఒక్కసారి కూడా పారిశుధ్య పనులు చేపట్టడం లేదని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొల్లాపూర్‌ మునిసిపాలిటీలో కేవలం 12మంది మాత్ర మే రెగ్యులర్‌ పారిశుధ్య సిబ్బంది ఉండగా అవుట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన 60మంది పని చేస్తున్నారు. ఇక్కడ రెగ్యులర్‌గా రోడ్లు, మురుగు కాల్వలు శుభ్రం చేయడాని కి మరో 50 మంది అవసరమవుతారు. 


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.