Merina బీచ్‌లో డ్రోన్లతో పహారా

ABN , First Publish Date - 2022-07-08T14:03:19+05:30 IST

స్థానిక మెరీనా సముద్రతీరంలో డ్రోన్‌ ద్వారా పోలీసులు పహారా చేపట్టారు. మెరీనా తీరానికి ప్రతిరోజు వేలాది మంది వచ్చి సేద తీరుతుంటారు. అలాగే,

Merina బీచ్‌లో డ్రోన్లతో పహారా

పెరంబూర్‌(చెన్నై), జూలై 7: స్థానిక మెరీనా సముద్రతీరంలో డ్రోన్‌ ద్వారా పోలీసులు పహారా చేపట్టారు. మెరీనా తీరానికి ప్రతిరోజు వేలాది మంది వచ్చి సేద తీరుతుంటారు. అలాగే, ఉదయం, సాయంత్రం సమయాల్లో మెరీనా సర్వీస్‌ రోడ్డులో వాకింగ్‌ చేసే వారి సంఖ్య పెరుగుతోంది. కొద్దిరోజులుగా సముద్ర వాతావరణంలో ఏర్పడిన మార్పుల కారణంగా మెరీనా తీరంలో అలల ఉధృతి అధికంగా ఉంటోంది. మెరీనా తీరానికి సేదతీరేందుకు వస్తున్న చిన్నారులు, యువకులు స్నానాలకు వెళ్లి అలల తాకిడికి చిక్కి మృతిచెందుతున్నారు. ఈ ఘటనలను అడ్డుకొనేలా బీచ్‌లో పోలీసు భద్రతను పెంచడంతో పాటు, సముద్రంలో స్నానాలు చేయరాదని హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేశారు. ఈ నేపథ్యంలో, నిబంధనలు ఉల్లంఘించి స్నానం చేస్తున్న వారు, నేరాలు, చోరీలు తదితరాలను అడ్డుకొనేలా డ్రోన్‌ సాయంతో మెరీనా తీరంలో భద్రత చేపట్టినట్లు నగర పోలీసు శాఖ తెలియజేసింది.

Updated Date - 2022-07-08T14:03:19+05:30 IST