మెస్‌ చార్జీలు చెల్లించాలి

ABN , First Publish Date - 2021-12-06T05:14:43+05:30 IST

మధ్యాహ్న భోజన పథకం మెస్‌ పెండింగ్‌ బిల్లులు వెంటనే చెల్లించాలని లేని పక్షంలో విద్యాశాఖ మంత్రి, కమిషనరేట్‌ కార్యాలయాలను ముట్టడిస్తామని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం రమేష్‌ బాబు హెచ్చరించారు.

మెస్‌ చార్జీలు చెల్లించాలి

ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్‌ బాబు

పెద్ద దోర్నాల, డిసెంబరు 5 : మధ్యాహ్న భోజన పథకం మెస్‌ పెండింగ్‌ బిల్లులు వెంటనే చెల్లించాలని లేని పక్షంలో విద్యాశాఖ మంత్రి, కమిషనరేట్‌ కార్యాలయాలను ముట్టడిస్తామని  ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం రమేష్‌ బాబు హెచ్చరించారు. ఏఐటీయూసీ కార్యాలయంలో మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ఆదివారం సమావేశం జరి గింది. ఈ సందర్భంగా ముఖ్య అతిఽథిగా పాల్గొన్న రమేష్‌ బాబు మాట్లాడు తూ ప్రస్తుతం పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా మెస్‌ చార్జీలు పెంచాలని డిమాండ్‌ చేశారు. మెస్‌ చార్జీలు పెంచకుండా, బకాయి లు ఇవ్వకుండా  పథకం ఎలా అమలు చేస్తారన్నారు. భోజన పథకం కార్మి కులకు నెలలు తరబడి వేతనాలు ఇవ్వకపోతే వారి కుటుంబం ఎలా గడుస్తుందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బకాయిలు చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో సీపీఐ ఎర్రగొండపాలెం నియోజకవర్గం కార్యదర్శి శ్రీనివాస్‌, సీనియర్‌ నాయకులు చెన్నయ్య, యూనియన్‌ మండల అధ్యక్షుడు స్వరూప్‌ ఆచారి, నాయకులు లక్ష్మీ, విజయ, రాములమ్మ పాల్గొన్నారు. 


Updated Date - 2021-12-06T05:14:43+05:30 IST