రాత్రి వేళ ప్రజలు ఉగాది వేడుకల్లో ఉండగా.. ఆకాశంలో ఒక్కసారిగా మెరుపులు.. ఉన్నట్టుండి భూమిపై పడిన వస్తువులు చూసి..

ABN , First Publish Date - 2022-04-05T00:01:27+05:30 IST

ప్రజలంతా రాత్రి వేళ ఉగాది సంబరాల్లో ఉండగా.. ఆకాశంలో ఒక్కసారిగా మెరుపులు దర్శనమిచ్చాయి. అంతా చూస్తుండానే ఆకాశం నుంచి దూసుకొచ్చిన...

రాత్రి వేళ ప్రజలు ఉగాది వేడుకల్లో ఉండగా.. ఆకాశంలో ఒక్కసారిగా మెరుపులు.. ఉన్నట్టుండి భూమిపై పడిన వస్తువులు చూసి..

ఆకాశంలో అప్పడప్పుడూ అద్భుతాలు జరుగుతుంటాయి. ఆకాశం నుంచి చేపలు, కప్పలు, పాములు కిందపడడం.. కొన్నిసార్లు వింత వింత వస్తువులు నేలపై పడడం తెలిసిందే. ఇలాంటి సందర్భాల్లో చాలా ఆశ్చర్యం వేస్తుంటుంది. కొన్నిసార్లు నమ్మశక్యం కాని వార్తలు వింటుంటాం. మహారాష్ట్రలో జరిగిన ఘటన అందరినీ ఆశ్చర్యానికి, భయాందోళనకు గురి చేసింది. ప్రజలంతా రాత్రి వేళ ఉగాది సంబరాల్లో ఉండగా.. ఆకాశంలో ఒక్కసారిగా మెరుపులు దర్శనమిచ్చాయి. అంతా చూస్తుండానే ఆకాశం నుంచి దూసుకొచ్చిన అగ్ని కీలలు ఒక్కసారిగా భూమిని తాకాయి. ఏమైందో ఎవరికీ అర్థం కాలేదు. చివరకు దగ్గరికి వెళ్లి చూసి.. అంతా షాక్ అయ్యారు...


మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా సిందేవాహి తహసీల్‌ పరిధి లడ్‌బోలి గ్రామంలో శనివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఉగాది సందర్భంగా గ్రామస్తులు అంతా సంబరాల్లో ఉన్నారు. అదే సమయంలో ఆకాశంలో ఒక్కసారిగా మెరుపులు కనపడ్డాయి. ఏదో వస్తువు నిప్పు రవ్వలు చిమ్ముతూ నేల పైకి రావడాన్న ప్రజలు గమనించారు. ఒక్కసారిగా నేలను తాకడంతో అంతా భయాందోళనకు గురయ్యారు. అయితే మనుషులు లేని ప్రాంతంలో పడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తర్వాత దగ్గరికి వెళ్లి చూసి షాక్ అయ్యారు. 8నుంచి 10 అడుగుల వ్యాసం కలిగిన ఉంగరం ఆకారంలో ఉన్న ఇనుప వస్తువును గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

ఒక్క ఫోన్‌తో ప్రయాణికులను హడలెత్తించిన 12 ఏళ్ల పిల్లాడు.. ఎందుకిలా చేశావని రైల్వే పోలీసులు నిలదీస్తే..


అక్కడికి చేరుకున్న పోలీసులు, నిపుణులు దాన్ని పరిశీలించారు. అలాగే ఆదివారం ఉదయం పవన్‌పాడ్ గ్రామంలో 1-1.5 అడుగుల వ్యాసం కలిగిన లోహపు స్థూపాకార వస్తువు కూడా నేలపై పడినట్లు గుర్తించారు. సేకరించిన వస్తువులను స్థానికులు ట్రాక్టర్లలో సిందేవాహి పోలీస్ స్టేషన్‌కి తరలించారు. దీనిపై ఖగోళ నిపుణులు మాట్లాడుతూ కక్షలో తిరిగే ఉపగ్రహం నియంత్రణ కోల్పోయి.. భూ వాతావరణంలోకి వచ్చిందన్నారు. దాని విడిభాగాలు  రాజస్థాన్, గుజరాత్, ఎంపీ మరియు మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో పడినట్లు తెలిపారు. ఇలాంటి ఘటన సుమారు 14 సంవత్సరాల క్రితం జరిగిందని నిపుణులు గుర్తు చేశారు.

ఆవులు, గేదెలు లేకుండా పాల వ్యాపారమేంటని అంతా నవ్వారు.. కానీ ఇప్పుడు లక్షల సంపాదన..!

Updated Date - 2022-04-05T00:01:27+05:30 IST