మెంతుల పులుసు

ABN , First Publish Date - 2022-04-30T17:35:46+05:30 IST

చింతపండు - నిమ్మకాయంత, మెంతులు - ఒక టీస్పూన్‌, సాంబారు పొడి - రెండు టీస్పూన్లు, ఉప్పు - తగినంత, ఆవాలు - అర టీస్పూన్‌, మినప్పప్పు - అర టీస్పూన్‌, శనగపప్పు

మెంతుల పులుసు

కావలసినవి: చింతపండు - నిమ్మకాయంత, మెంతులు - ఒక టీస్పూన్‌, సాంబారు పొడి - రెండు టీస్పూన్లు, ఉప్పు - తగినంత, ఆవాలు - అర టీస్పూన్‌, మినప్పప్పు - అర టీస్పూన్‌, శనగపప్పు - అర టీస్పూన్‌, జీలకర్ర - పావు టీస్పూన్‌, ఎండుమిర్చి - రెండు, పసుపు - పావు టీస్పూన్‌, కరివేపాకు - రెండు రెమ్మలు, నూనె - ఒక టేబుల్‌స్పూన్‌.


తయారీ విధానం: ముందుగా చింతపండు రసం తీసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్‌పై బాణలి పెట్టి కాస్త నూనె వేసి వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. శనగపప్పు, మెంతులు, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. తరువాత చింతపండు రసం పోయాలి. సాంబారు పొడి, పసుపు, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. పులుసు చిక్కగా అయ్యాక దింపుకోవాలి. 


Updated Date - 2022-04-30T17:35:46+05:30 IST