రేవూరు హాస్టల్‌ మేట్రిన్‌కు పురస్కారం

ABN , First Publish Date - 2022-08-17T03:34:54+05:30 IST

పదో తరగతిలో ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేసిన రేపూరు బీసీ బాలికల వసతిగృహ మేట్రిన్‌ మలేశ్వరికి సాతంత్య్ర దినోత్సవం

రేవూరు హాస్టల్‌ మేట్రిన్‌కు పురస్కారం
అధికారుల నుంచి ప్రశంసాపత్రం అందుకుంటున్న మేట్రిన్‌ మల్లేశ్వరి

అనంతసాగరం, ఆగస్టు 16: పదో తరగతిలో ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేసిన రేపూరు బీసీ బాలికల వసతిగృహ మేట్రిన్‌ మలేశ్వరికి సాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రశంసాపత్రం లభించింది. ఆమె అనంతసాగరం బీసీ బాలుర వసతి గృహానికి ఇన్‌చార్జి మేట్రిన్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. విధి నిర్వహణలో ఉత్తమ సేవలకుగాను జిల్లా ఇన్‌చార్జి మంత్రి అంబటి రాంబాబు చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకున్నారు.  ఈ సందర్భంగా ఆమెను జిల్లా బీసీ సంక్షేమశాఖాధికారి వెంకటయ్య, ఏబీసీడబ్ల్యూ శ్రీదేవి  తదితరులు అభినందించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు, వసతిగృహ సిబ్బంది ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - 2022-08-17T03:34:54+05:30 IST