Metro Trains శబ్దాన్ని తగ్గించేందుకు చర్యలు

ABN , First Publish Date - 2022-07-15T13:33:31+05:30 IST

నగరంలో తిరిగే మెట్రోరైళ్ల శబ్దాన్ని తగ్గించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. చెన్నైలో ట్రాఫిక్‌ సమస్య పరిష్కార చర్యల్లో భాగంగా మెట్రో కారిడార్లను

Metro Trains శబ్దాన్ని తగ్గించేందుకు చర్యలు

అడయార్‌(చెన్నై), జూలై 14: నగరంలో తిరిగే మెట్రోరైళ్ల శబ్దాన్ని తగ్గించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. చెన్నైలో ట్రాఫిక్‌ సమస్య పరిష్కార చర్యల్లో భాగంగా మెట్రో కారిడార్లను నిర్మించి, రెండు మార్గాల్లో మెట్రో రైళ్ళను నడుపుతున్న విషయం తెలిసిందే. వింకో నగర్‌ నుంచి ఎయిర్‌పోర్టు మధ్య భూగర్భం, పిల్లర్ల నిర్మించి రైలు మార్గంపై రైళ్ళు నడుస్తున్నాయి. అయితే, ఈ రైళ్ళు నడిచే సమయంలో శబ్దం అధికంగా ఉంటుంది. దీన్ని తగ్గించేందుకు చెన్నై మెట్రో రైల్‌ లిమిటెడ్‌ చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా పట్టాలకు గ్రీజ్‌ పూసే అత్యాధునిక యంత్రాలను కొనుగోలు చేసేందుకు టెండర్లను ఆహ్వానించింది. ఈ యంత్రాల ద్వారా గ్రీజ్‌ వేయడం వలన పట్టాలు, రైలు చక్రాల మధ్య రాపిడితో పాటు శబ్దం కూడా తగ్గనుంది. శబ్దకాలుష్యాన్ని తగ్గించడంలో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. 

Updated Date - 2022-07-15T13:33:31+05:30 IST