మేట్టూరు డ్యాంకు పెరిగిన ఇన్‌ఫ్లో

ABN , First Publish Date - 2022-06-16T15:07:18+05:30 IST

సేలం జిల్లాలోని మేట్టూరు డ్యాంకు వస్తున్న నీటి ప్రవాహం స్వల్పంగా పెరిగింది. కావేరి పరీవాహక ప్రాంతాల్లో వర్షాలతో మేట్టూరు డ్యాంలోని మంగళవారం

మేట్టూరు డ్యాంకు పెరిగిన ఇన్‌ఫ్లో

ప్యారీస్‌(చెన్నై), జూన్‌ 15: సేలం జిల్లాలోని మేట్టూరు డ్యాంకు వస్తున్న నీటి ప్రవాహం స్వల్పంగా పెరిగింది. కావేరి పరీవాహక ప్రాంతాల్లో వర్షాలతో మేట్టూరు డ్యాంలోని మంగళవారం సాయంత్రం సెకనుకు 2,526 ఘనపుటడుగులుగా వస్తున్న నీరు బుధవారం ఉదయం 3,996 ఘనపుటడుగులకు పెరిగింది. ప్రస్తుతం జలాశయంలో 112.11 అడుగులు (పూర్తి సామర్ధ్యం 120 అడుగులు) నీటినిల్వలుండగా,  డెల్టా జిల్లాల సాగునీటి కోసం 15 వేల ఘనపుటడుగులు విడుదల చేస్తున్నట్లు ప్రజాపనుల శాఖ అధికారులు తెలిపారు.


Updated Date - 2022-06-16T15:07:18+05:30 IST