కరోనాతో ఎంజీఎం వైద్యురాలి మృతి

ABN , First Publish Date - 2021-05-11T06:28:52+05:30 IST

కరోనాతో ఎంజీఎం వైద్యురాలి మృతి

కరోనాతో ఎంజీఎం వైద్యురాలి మృతి
డాక్టర్‌ శోభారాణి (ఫైల్‌)

వారం రోజులుగా ప్రైవేట్‌ ఆస్పత్రిలో  చికిత్స 


ఆక్సిజన్‌ బెడ్‌ లభించకపోవడంతో హైదరాబాద్‌కు తరలింపులో జాప్యం


 హన్మకొండ అర్బన్‌,  మే 10 : కరోనాతో పోరాడుతూ ఎంజీఎం ఆస్పత్రి వైద్యురాలు డాక్టర్‌ పసునూరి శోభారా ణి(40) మృతి చెందారు.  బంధువుల వివరాల మేరకు.. ఏడాదిన్నర కాలంగా శోభారాణి ఎంజీఎంలో డాక్టర్‌గా సేవలందిస్తున్నారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా బొల్లికుంటకు చెందిన శోభారాణి భర్త డాక్టర్‌ వెంకట్‌ రావు సైతం హైదరాబాద్‌ నాచారం ఈఎస్‌ఐ ఆస్పత్రిలో వైద్యుడు. ఎంజీఎం కొవిడ్‌ వార్డులో విధులు నిర్వర్తిస్తున్న క్రమంలో వారం రోజుల క్రితం శో భారాణి కరోనా బారిన పడగా చికిత్స నిమిత్తం వరంగల్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో అడ్మిట్‌ చేశారు. అయినా ఆమె ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో స్థానికంగా ఉన్న మరో ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తర లించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. హైదరాబాద్‌లోని ఏ ఆస్పత్రిలోనూ ఆక్సిజ న్‌ బెడ్‌ లభించకపోవడంతో వరంగల్‌లోనే చికిత్స కొనసాగించారు. ఆరోగ్యం పూర్తి గా క్షీణించడంతో ఆదివారం రాత్రి డాక్టర్‌ శోభారాణి తుది శ్వాస విడిచారు. ఆమెకు ఇద్దరు కుమారులు సాత్విక్‌, జాయ్‌ ఉన్నారు. హన్మకొండ వడ్డెపల్లిలో ఆదివారమే ఆమె అంత్యక్రియలను పూర్తి చేశారు. డాక్టర్‌ శోభారాణి మృతితో ఎంజీఎం ఆస్పత్రి వైద్య వర్గాలు తీవ్ర విచారంలో మునిగిపోయాయి.

Updated Date - 2021-05-11T06:28:52+05:30 IST