Advertisement

ఇకపై ఎంజీఎంలో 24 గంటల పాటు కరోనా పరీక్షలు: సూపరింటెండెంట్

Sep 16 2020 @ 13:39PM

వరంగల్: ఎంజీఎంలో కొవిడ్ వార్డులో రోగుల సంఖ్య పెరిగిందని ఎంజీఎం సూపరింటెండెంట్ నాగార్జున రెడ్డి తెలిపారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఆస్పత్రిలో 440 ఆక్సిజన్ బెడ్స్ ఉన్నాయని.. ప్రస్తుతం 130మంది కొవిడ్ రోగులకు చికిత్స అందిస్తున్నామని చెప్పారు. ఎంతమంది రోగులు వచ్చినా చికిత్స అందిస్తామని తెలిపారు. కరోనా లక్షణాలతో వచ్చిన వారికి వెంటనే పరీక్షలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఎంజీఎంలో ఇక నుంచి 24 గంటలపాటు కొవిడ్ పరీక్షలు చేస్తామని తెలియజేశారు. ఎంజీఎంలో వెంటిలేటర్ల కొరతలేదని సూపరింటెండెంట్ స్పష్టం చేశారు. 

Follow Us on:
Advertisement
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.