high security: డ్రోన్లపై అప్రమత్తంగా ఉండండి..కేంద్ర హోంమంత్రిత్వశాఖ హెచ్చరిక

ABN , First Publish Date - 2021-07-26T17:37:41+05:30 IST

జమ్మూ డ్రోన్ దాడి అనంతరం కేంద్ర హోంమంత్రిత్వశాఖ డ్రోన్ దాడులపై అప్రమత్తం అయింది....

high security: డ్రోన్లపై అప్రమత్తంగా ఉండండి..కేంద్ర హోంమంత్రిత్వశాఖ హెచ్చరిక

న్యూఢిల్లీ : జమ్మూ డ్రోన్ దాడి అనంతరం కేంద్ర హోంమంత్రిత్వశాఖ డ్రోన్ దాడులపై అప్రమత్తం అయింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15వతేదీన డ్రోన్ సంచారంపై అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోంమంత్రిత్వశాఖ అన్ని భద్రతా సంస్థలను ఆదేశించింది. ఢిల్లీలో స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా డ్రోన్లు, పారాగ్లైడర్లు, మైక్రోలెట్ విమానాలు, హాట్ ఎయిర్ బెలూన్లు ఆకాశంలో ఎగిరే అవకాశమున్నందున కేంద్ర భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉండి వీటిని అరికట్టాలని కేంద్రం హోంమంత్రిత్వశాఖ సూచించింది. ఎర్రకోట ఉన్న ఉత్తర ఢిల్లీలో భవనాల పైకప్పులపై కేంద్ర భద్రతా బలగాలతో పహరా ఏర్పాటు చేయాలని కేంద్ర హోం మంత్రిత్వశాఖ కోరింది.


 డ్రోన్లు కనిపిస్తే వాటిపై కాల్పులు జరపాలని కేంద్రం సూచించింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో డ్రోన్లు, పారాగ్లైడర్లు, హాట్ ఎయిర్ బెలూన్లను ఎగురవేయడాన్ని నిషేధిస్తూ ఢిల్లీ పోలీసు కమిషనర్ బాలాజీ శ్రీవాస్తవ ఆదేశాలు జారీచేశారు.ఆగస్టు 16వతేదీ వరకు డ్రోన్లపై నిషేధ ఉత్తర్వులు అమలులో ఉంటాయని ఢిల్లీ పోలీసులు చెప్పారు.జమ్మూ వైమానిక కేంద్రం వద్ద డ్రోన్ల ద్వారా బాంబులు వేసిన నేపథ్యంలో కేంద్ర హోంమంత్రిత్వశాఖ కేంద్ర బలగాలకు హైఅలర్ట్ ప్రకటించింది. 

Updated Date - 2021-07-26T17:37:41+05:30 IST