కొత్త ఫీచర్లతో ఎంఐ 10ఐ స్మార్ట్‌ఫోన్ విడుదల

ABN , First Publish Date - 2021-01-05T23:14:16+05:30 IST

కొత్త ఫీచర్లతో ఎంఐ 10ఐ స్మార్ట్‌ఫోన్ విడుదల

కొత్త ఫీచర్లతో ఎంఐ 10ఐ స్మార్ట్‌ఫోన్ విడుదల

న్యూఢిల్లీ: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ షియోమి తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త మోడళ్లలో స్మార్ట్‌ఫోన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. భారత మార్కెట్‌లో ఎంఐ 10ఐ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసినట్లు షియోమి ఇండియా పేర్కొంది.


భారత మార్కెట్‌లో 6జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ సదుపాయం ఉండే ఎంఐ 10ఐ స్మార్ట్‌ఫోన్ రూ. 20,999 ఉంటుంది. 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ స్మార్ట్‌ఫోన్ రూ. 21,999కే లభించనుంది. 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ మోడల్ ఫోన్ రూ. 23,999కే అందుబాటులో ఉంటుందని సంస్థ తెలిపింది. అమెజాన్ ఇండియా, ఎంఐ.కామ్, ఎంఐ స్టూడియో స్టోర్స్‌ అండ్ ఎంఐ హోమ్ స్టోర్స్ ద్వారా 10ఐ స్మార్ట్‌‌ఫోన్లను కొలుగోలు చేయచ్చని సంస్థ పేర్కొంది.

Updated Date - 2021-01-05T23:14:16+05:30 IST