కోహ్లీ కంటే విలియమ్సన్ గొప్ప ఆటగాడు: వాన్ వివాదాస్పద వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2021-05-15T18:10:33+05:30 IST

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కంటే న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ గొప్ప ఆటగాడని

కోహ్లీ కంటే విలియమ్సన్ గొప్ప ఆటగాడు: వాన్ వివాదాస్పద వ్యాఖ్యలు

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కంటే న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ గొప్ప ఆటగాడని, కేన్ భారత్‌లో పుట్టుంటే ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడు అయి ఉండేవాడని ఇంగ్లండ్ మాజీ సారథి మైకేల్ వాన్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో అనుచరుల పరంగా తప్ప కోహ్లీ, విలియమ్సన్ అన్నింటా సమానమేనని వాన్ అన్నాడు. అలాగే కేన్ భారత్‌లో పుట్టి ఉంటే వాణిజ్య ఒప్పందాలతో భారీగా డబ్బు సంపాదించేవాడని చెప్పాడు. 


``నాణ్యత, మైదానంలో అనుభవం, నిలకడపరంగా కేన్ విలువైన ఆటగాడు. ఒకవేళ అతను భారతీయుడై ఉంటే వాణిజ్య ఒప్పందాల ద్వారా ఏడాదికి 30-40 డాలర్లు సంపాదించగలిగేవాడు. మూడు ఫార్మాట్లలోనూ విలియమ్సన్ అద్భుతంగా ఆడతాడు. కోహ్లీతో పోల్చుకుంటే విలయమ్సన్ ఎందులోనూ తక్కువ కాదు. అయితే సోషల్ మీడియాలో మీరు ఒప్పుకోరు కాబట్టి కోహ్లీ గొప్ప కాదని అనన`ని వాన్ పేర్కొన్నాడు. 

Updated Date - 2021-05-15T18:10:33+05:30 IST