మైక్రోసాఫ్ట్‌ లాభం 83 వేల కోట్లు!

ABN , First Publish Date - 2020-02-02T21:11:29+05:30 IST

ప్రముఖ సాఫ్టవేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌కు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) రెండవ త్రైమాసికం(అక్టోబరు-డిసెంబరు)లో 82890 కోట్ల రూపాయల లాభం...

మైక్రోసాఫ్ట్‌ లాభం 83 వేల కోట్లు!

    • గత సంవత్సరంతో పోలిస్తే 38 శాతం పెరుగుదల
    • రెవెన్యూ 14 శాతం వృద్ధితో 2.63 లక్షల కోట్లు
    • క్లౌడ్ సర్సీస్ రెవెన్యూలో 39 శాతం వృద్ధి
    • డివిడెండ్, షేర్ బయ్‌బ్యాక్‌పై 60745 కోట్లు ఖర్చు

    ప్రముఖ సాఫ్టవేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌కు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) రెండవ త్రైమాసికం(అక్టోబరు-డిసెంబరు)లో 82890 కోట్ల రూపాయల లాభం కలిగింది. గత సంవత్సరం ఇదే త్రైమాసికంతో పోలిస్తే ఇది 38 శాతం ఎక్కువ. సంస్ధ రెవెన్యూలో 14 శాతం వృద్ధితో 2.63 లక్షల కోట్లకు చేరింది. ప్రస్తుతం కంపెనీ షేర్ విలువ 40 శాతం పెరిగి 1.51 డాలర్‌కు చేరింది.
     
    అజ్యూర్ డివిజన్‌లో 62 శాతం వృద్ధి... గత సంవత్సరంతో పోలిస్తే 2 శాతం తక్కువ
    కంపెనీ ఆర్థిక గణాంకాలు ఆశించిన స్థాయి కంటే బాగున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కానీ సంస్థలో అన్నింటి కంటే పెద్ద రెవెన్యూ విభాగం క్లౌడ్ సర్వీసింగ్‌లో ఉన్న అజ్యూర్ డివిజన్ 62 శాతం గ్రోత్ మాత్రమే నమోదైంది. ఇదే విభాగం గత సంవత్సర 63 శాతం వృద్ధి నమోదైంది. మైక్రోసాఫ్ట్ సంస్థ తన షేర్‌హోల్డర్లకు డివిడెండ్, షేర్ బయ్ బ్యాక్ ద్వారా 60745 కోట్లు ఇచ్చింది.

    Updated Date - 2020-02-02T21:11:29+05:30 IST