‘మైక్రోసాఫ్ట్‌’ ఉంటే పాస్‌వర్డ్స్‌ అక్కరలేదట!

ABN , First Publish Date - 2021-12-04T05:30:00+05:30 IST

ఇదంతా డిజిటల్‌ యుగం. ప్రతీ పనీ ఇప్పుడు ఆన్‌లైన్‌లోనే. ఆన్‌లైన్‌లో వ్యవహారాలు అంటే పాస్‌వర్డ్‌ల సొద అనక తప్పదు...

‘మైక్రోసాఫ్ట్‌’ ఉంటే  పాస్‌వర్డ్స్‌ అక్కరలేదట!

ఇదంతా డిజిటల్‌ యుగం. ప్రతీ పనీ ఇప్పుడు ఆన్‌లైన్‌లోనే. ఆన్‌లైన్‌లో వ్యవహారాలు అంటే పాస్‌వర్డ్‌ల సొద అనక తప్పదు. కొన్ని మోర్‌ సెక్యూరిటీ రిలేటెడ్‌ సైట్లలో పదేపదే పాస్‌వర్డ్‌ను మార్చాల్సి వస్తుంది. వాటన్నింటినీ గుర్తుపెట్టుకోవడం కూడా కష్టం. ఎక్కడా రాసిపెట్టుకునే వీలు కూడా ఉండదు. ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్‌ ఇందుకు ప్రత్యామ్నాయాన్ని కనుగొంది. అథెంటికేటర్‌ యాప్‌ను రూపొందించింది. ఈ యాప్‌ను మొదట కమర్షియల్‌ సంస్థలకు అందుబాటులోకి తెచ్చింది.


ఇదే విషయాన్ని మైక్రోసాఫ్ట్‌ ఒక బ్లాగ్‌ పోస్ట్‌లో తెలియజేసింది. ‘ఈ రోజు నుంచి మైక్రోసాఫ్ట్‌ అకౌంట్‌కు సంబంధించి పాస్‌వర్డ్‌ను తొలగించుకోండి. అథెంకేటర్‌ యాప్‌ను ఉపయోగించండి. విండోస్‌ హలో, సెక్యూరిటీ కీ లేదా వెరిఫికేషన్‌ కోడ్‌ మీ ఫోన్‌ లేదంటే మెయిల్‌కు వస్తుంది. తద్వారా మీ ఫేవరేట్‌ యాప్‌ లేదంటే సర్వీసు అంటే మైక్రోసాఫ్ట్‌ ఔట్‌లుక్‌, మైక్రోసాప్ట్‌ వన్‌ డ్రైవ్‌, మైక్రోసాఫ్ట్‌ ఫ్యామిలీ సేఫ్టీ తదితరాలను ఉపయో గించుకోవచ్చు’ అని తెలిపింది.


నిజానికి పాస్‌వర్డ్‌లు అటాక్‌లకు ఎంట్రీ పాయింట్స్‌, ప్రతి సెకెండ్‌కు పెద్ద ఎత్తున బలయ్యే పాస్‌వర్డ్స్‌ 579గా గుర్తించారు. ఏడాదికి 18 బిలియన్లుగా డబ్బుగా లెక్కగట్టారు. అసలీ హ్యాకింగ్‌ ప్రధాన కారణాలు రెండు. ఒకటి మానవ, రెండోది హ్యాకర్‌ స్వభావాలు. సులువుగా గుర్తుపెట్టుకోవడానికి వీలు ఉంటుందని ఎప్పుడైతే అనుకుంటారో... అప్పుడే హాకర్లకు చాన్స్‌ ఇచ్చినట్టేనట.


పాస్‌వర్డ్‌లెస్‌కు ఎలా మారాలంటే...

  మైక్రోసాఫ్ట్‌ అథెంకేటర్‌ యాప్‌ని కొన్ని క్లిక్స్‌తో తెచ్చుకోవచ్చు. 

 ఈ యాప్‌ను మొదట డౌన్‌లోడ్‌ చేసుకుని పర్సనల్‌ మైక్రోసాఫ్ట్‌ అకౌంట్‌కు లింక్‌ చేసుకోవాలి. 

  మైక్రోసాఫ్ట్‌ అకౌంట్‌లోకి వెళ్ళి సైన్‌ ఇన్‌ చేయాలి. అడ్వాన్స్‌డ్‌ సెక్యూరిటీ ఆప్షన్స్‌ను ఎంపిక చేసుకోవాలి. దాని కిందే పాస్‌వర్డ్‌లెస్‌ అకౌంట్‌ ఉంటుంది. ఎంపిక చేసి టర్న్‌ ఆన్‌ చేసుకోవాలి. 

  ఆన్‌స్ర్కీన్‌ ప్రాంప్ట్స్‌ను ఫాలో కావాలి. తరవాత అథెంకేటర్‌ యాప్‌ నుంచి నోటిఫికేషన్‌ను ఆమోదించాలి. ఒకసారి ఆమోదిస్తే చాలు పాస్‌వర్డ్‌ నుంచి విము క్తులవుతారు. పాస్‌వర్డ్‌ కావాలని అనుకుంటే మాత్రం దాన్ని అకౌంట్‌కు మళ్ళీ జత చేయాల్సి ఉంటుంది. 

Updated Date - 2021-12-04T05:30:00+05:30 IST