ఓవెన్‌ వాడుతున్నారా!

ABN , First Publish Date - 2021-02-18T05:55:11+05:30 IST

ఇంట్లో మైక్రోవేవ్‌ ఓవెన్‌ ఉంటే చాలా వరకు వంటింటి పనులు సులభంగా అయిపోతాయి. అయితే ఓవెన్‌ని వినియోగించేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. అవేమిటంటే...

ఓవెన్‌ వాడుతున్నారా!

ఇంట్లో మైక్రోవేవ్‌ ఓవెన్‌ ఉంటే చాలా వరకు వంటింటి పనులు సులభంగా అయిపోతాయి. అయితే ఓవెన్‌ని వినియోగించేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. అవేమిటంటే...


ఆన్‌ చేసిన ఐదు నిమిషాల తర్వాత ఓవెన్‌ని వాడాలి.

అలాగే ఓవెన్‌ స్వీచ్‌ ఆఫ్‌ చేసిన రెండు నిమిషాల తర్వాతే అందులోంచి పదార్థాలను బయటకు తీయాలి.

ఓవెన్‌లో పెట్టిన వంటకాలు ఉడుకుతున్నాయా లేదా అనేది ఓవెన్‌కు ఉన్న ట్రాన్స్‌పరెంట్‌ పొర నుంచి చూడాలి.

మురికిగా ఉన్న ఓవెన్‌ను పొడిబట్టతో శుభ్రంగా తుడవాలి. అలాకాకుండా నీటితో కడిగితే ఓవెన్‌ పాడవుతుంది.

సాధారణ ఓవెన్‌ కన్నా ఆటోమేటిక్‌ కంట్రోల్‌ సిస్టమ్‌ ఉన్న ఎలకా్ట్రనిక్‌ ఓవెన్‌ ఉపయోగించడం మంచిది.

ఓవెన్‌ని ఒకసారి వినియోగించిన తర్వాత మళ్లీ వాడాల్సి వస్తే పది నిమిషాలు  ఆగాలి. అప్పటికి ఓవెన్‌ చల్లబడుతుంది

వేడిగా ఉన్నప్పుడు ఓవెన్‌ డోర్‌ను బలవంతంగా తెరవొద్దు. ఓవెన్‌ చల్లాబడ్డాక డోర్స్‌ సులువుగా తెరచుకుంటుంది. 

Updated Date - 2021-02-18T05:55:11+05:30 IST