కట్టెల పొయ్యితో కష్టాలు

ABN , First Publish Date - 2022-08-17T05:18:13+05:30 IST

ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన నిర్వాహకులు కట్టెల పొయ్యి వద్ద పొగచూరిపోతున్నారు. అక్కన్నపేట మండలంలో 9 ఉన్నత, 6 ప్రాథమికోన్నత, 48 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. 3,200 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేస్తున్నారు. కొన్ని పాఠశాలల్లో వంట గదులు ఉండగా, చాలాచోట్ల వరండాలు, ఆరుబయట వంటలు చేస్తున్నారు.

కట్టెల పొయ్యితో కష్టాలు
అక్కన్నపేట ప్రభుత్వ పాఠశాలలో కట్టెల పొయ్యిపై వంట చేస్తున్న మధ్యాహ్న భోజన నిర్వాహకులు

పొగతో ఇబ్బందులు పడుతున్న మధ్యాహ్న భోజన నిర్వాహకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు


అక్కన్నపేట, ఆగస్టు 16: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన నిర్వాహకులు కట్టెల పొయ్యి వద్ద పొగచూరిపోతున్నారు. అక్కన్నపేట మండలంలో 9 ఉన్నత, 6 ప్రాథమికోన్నత, 48 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. 3,200 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేస్తున్నారు. కొన్ని పాఠశాలల్లో వంట గదులు ఉండగా, చాలాచోట్ల వరండాలు, ఆరుబయట వంటలు చేస్తున్నారు. మధ్యాహ్న భోజన నిర్వాహకులకు గ్యాస్‌ సిలిండర్లు సరఫరా చేస్తామని కేంద్ర ప్రభుత్వం గతంలో ప్రకటించింది. కానీ ఈ నిర్ణయం అమలుకు నోచుకోపోవడంతో కట్టెల పొయ్యిమీదే వంట చేస్తున్నారు. వంట చేసేవారితో పాటు విద్యార్థులు, ఉపాధ్యాయులు పొగతో ఇబ్బందులు  ఎదుర్కొంటున్నారు. వర్షాకాలంలో కట్టెలు తడిసి మంట సరిగ్గా మండక తిప్పలు పడుతున్నారు. ప్రభుత్వాలు స్పందించి తమకు గ్యాస్‌ అందజేస్తే కష్టాలు తప్పుతాయని నిర్వాహకులు కోరుతున్నారు. 

Updated Date - 2022-08-17T05:18:13+05:30 IST