సమావేశంలో మాట్లాడుతున్న చిరంజీవి చౌదరి
కన్జర్వేటివ్ ఫారెస్ట్స్ ప్రిన్సిపల్ చీఫ్ చిరంజీవి చౌదరి
విజయవాడ, మార్చి 27 (ఆంధ్రజ్యోతి) : ఇళ్లల్లో మిద్దె తోటల పెంపకం వల్ల స్వచ్ఛమైన ప్రాణవాయువును పొందే అవకాశం ఉంటుందని కన్జర్వేటివ్ ఫారెస్ట్స్ ప్రిన్సిపల్ చీఫ్ చిరంజీవి చౌదరి అన్నారు. విజయవాడ, గుంటూరు టెర్రాస్ గార్డెన్స్ ఆధ్వర్యంలో పటమటలోని ఫన్టైమ్ క్లబ్లో ఆదివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి చౌదరి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పచ్చదనంపై ఆసక్తి ఉన్నప్పటికీ తమ ఇళ్లల్లో తగిన ప్రదేశం లేనివారు మిద్దె తోటలు పెంచుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో మిద్దె తోటల సాగుదారుల సంఘం వ్యవస్థాపకుడు శ్రీనివాస్, ఉద్యాన శాఖ సంయుక్త సంచాలకుడు దేవమునిరెడ్డి, మిద్దె తోటల నిపుణుడు నిమ్మగడ్డ విజయ్, ఎం.హనుమంతరావు, సిటీ ఆఫ్ టెర్రాస్ గార్డెన్ విజయవాడ ప్రతినిధి ఏలూరి లీలాకుమారి పాల్గొన్నారు.