మద్యం సేవించి మహిళతో అసభ్యకర చేష్టలు.. అతడికి ఆమె ఎలా బుద్ధి చెప్పిందంటే..

ABN , First Publish Date - 2022-04-10T18:07:14+05:30 IST

ఆమె ఓ ఉద్యోగిని.. రోజూ ఇంటి నుంచి నడిచి ఆఫీస్‌కు వెళ్తుంటుంది..

మద్యం సేవించి మహిళతో అసభ్యకర చేష్టలు.. అతడికి ఆమె ఎలా బుద్ధి చెప్పిందంటే..

ఆమె ఓ ఉద్యోగిని.. రోజూ ఇంటి నుంచి నడిచి ఆఫీస్‌కు వెళ్తుంటుంది.. శనివారం ఉదయం కూడా ఎప్పటిలాగానే ఆఫీస్‌కు బయల్దేరింది.. మార్గమధ్యంలో ఓ తాగుబోతు ఆమెను అడ్డగించాడు.. ఆమెతో అసభ్యకరంగా మాట్లాడాడు.. తీవ్ర ఆగ్రహానికి గురైన మహిళ అతడిపై తిరగబడింది.. నడిరోడ్డుపై చెప్పు తీసి అతడిని చితక్కొట్టింది.. చుట్టూ ఉన్న వాళ్లు కూడా తాగుబోతుపై విరుచుకుపడ్డారు.. మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలిలో ఈ ఘటన జరిగింది. 


బైదాన్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ శనివారం ఉదయం రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా మద్యం మత్తులో ఉన్న మధ్యవయస్కుడు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. అసభ్యకర భాషతో ఆమెను వేధించాడు. దీంతో ఆ మహిళ తీవ్ర ఆగ్రహానికి గురై అతడికి బుద్ధి చెప్పింది. చెప్పుతో, కర్రతో తీవ్రంగా కొట్టింది. ఆ తాగుబోతు కూడా ఆ మహిళపై దాడికి ప్రయత్నించాడు.


ఆ ప్రాంతంలో ఉన్న ఇతరులు కూడా ఆ తాగుబోతును కొట్టారు. ఆ వీడియో వైరల్ కావడంతో పోలీసులు స్పందించారు. అయితే కేసు పెట్టేందుకు ఆ మహిళ అంగీకరించలేదు. మద్యం మత్తులో అతడు అలా ప్రవర్తించాడని, అతనికి తగిన బుద్ధి చెప్పానని, అతడిని అరెస్ట్ చేయవద్దని పోలీసులకు మహిల విజ్ఞప్తి చేసింది. 

Updated Date - 2022-04-10T18:07:14+05:30 IST