మిడ్‌మానేరు నిర్వాసితుల రాస్తారోకో

ABN , First Publish Date - 2022-08-18T06:14:57+05:30 IST

మధ్యమానేరులో సర్వస్వం కోల్పోయిన తమకు రావాల్సిన పరిహారం చెల్లించాలని వేములవాడ మండల సంకెపల్లి నిర్వాసితులు కరీంనగర్‌ - వేములవాడ రహదారిపై బుధవారం రాస్తారోకో నిర్వహించారు.

మిడ్‌మానేరు నిర్వాసితుల రాస్తారోకో
నిర్వాసితులతో మాట్లాడుతున్న సీఐ

వేములవాడ టౌన్‌, ఆగస్టు 17: మధ్యమానేరులో సర్వస్వం కోల్పోయిన తమకు రావాల్సిన పరిహారం చెల్లించాలని వేములవాడ మండల సంకెపల్లి నిర్వాసితులు కరీంనగర్‌ - వేములవాడ రహదారిపై  బుధవారం రాస్తారోకో నిర్వహించారు.  గత నెలలో ధర్నా చేస్తే సమస్యలను నెలలోపు పరిష్కరిస్తామని మాట ఇచ్చిన అఽధికారులు దాట వేస్తున్నారన్నారు.  వెంటనే న్యాయం చేయాలని భీష్మించారు.  డీఎస్పీ నాగేంద్రచారి, టౌన్‌ సీఐ వెంకటేష్‌ నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. కలెక్టర్‌ రావాల్సిందిగా నినాదాలు చేశారు. దీంతో చేసేదేమి లేక తహసీల్దార్‌ రాజరెడ్డి జిల్లా ఉన్నతాధికారులను కలిసేందుకు ఏర్పాటు చేస్తానని నచ్చజెప్పారు. రెండు గంటల పాటు రాస్తారోకో కొనసాగడంతో వాహనదారులకు, నిర్వాసితులకు మధ్య చిన్న వాగ్వావాదం చోటు చేసుకుంది.  అనుమతి రాస్తారోకో చచేపట్టి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించినా శేఖర్‌, సురేష్‌, పూర్ణచందర్‌తోపాటు పలువురిపై కేసు నమోదు చేసినట్లు టౌన్‌ సీఐ తెలిపారు. 

Updated Date - 2022-08-18T06:14:57+05:30 IST