వలస బండి

ABN , First Publish Date - 2021-10-27T05:32:24+05:30 IST

పశ్చిమ ప్రాంతం నుంచి వలసలు కొనసాగుతున్నాయి. స్థానికంగా పనులు లేవు. ఉపాధి పనులు చూపించడం లేదు.

వలస బండి
హొళగుందలో వలస వెళ్తున్న కూలీలు

 పశ్చిమ ప్రాంతం నుంచి వలసలు కొనసాగుతున్నాయి. స్థానికంగా పనులు లేవు. ఉపాధి పనులు చూపించడం లేదు. ఒక వేళ ఉపాధి పనులు చేసినా, వేతనాల చెల్లింపులో అంతులేని జాప్యం జరుగుతోందని, పూట గడవడం కష్టమైన నేపథ్యంలో ఎక్కడ పనులు దొరికితే అక్కడికి వెళ్లక తప్పడం లేదని కూలీలు అంటున్నారు. హొళగుంద బీసీ కాలనీకి చెందిన సుమారు 90 కుటుంబాలు మంగళవారం సాయంత్రం తెలంగాణలోని సదాశివపే టకు వలస బాట పట్టాయి. అక్కడ పత్తి కోత పనులు ఉండటంతో లారీ ఎక్కి బయలుదేరారు. అధికారులు తమకు ఉపాధి కల్పించడం లేదని, అందుకే భార్యాబిడ్డలతో వలస వెళ్లకతప్పడం లేదని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో చేసిన ఉపాధి పనులకు కూలి డబ్బులు ఇంకా చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బడికి వెళ్లే పిల్లలను సైతం వెంటబెట్టుకుని వెళుతున్నారు. వారిని ఇంటి వద్ద వదిలేసి వెళితే ఎవరు చూసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. 

- హొళగుంద


Updated Date - 2021-10-27T05:32:24+05:30 IST